నిలకడగా..కృష్ణమ్మ

జోగుళాంబ గద్వాల/నమస్తే తెలంగాణ : జూరాలకు స్థిరంగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. మంగళవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 22,000 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 17,744 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో పీజేపీలోని గేట్లను మూసి వేశారు. కేవలం పవర్ హౌస్‌కు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులకుగానూ 1044.160 అడుగుల కు నీరు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 9.6 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 9.132 టీఎంసీలుగా నమోదైంది. పవర్ హౌస్‌కు 12,671 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. కుడి కాలువ ద్వారా 475 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 900 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు నీటి పంపింగ్ కొనసాగుతున్నది. నెట్టెంపాడు ప్రాజెక్ట్‌కు 1,500 క్యూసెక్కులు, భీమా-1కు 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు 630 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్‌లకు వరద తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి ఇన్‌ఫ్లో 11,179 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 6,746 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ 1697.01 అడుగులకు నీరు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 90.93 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 5,210 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 5,582 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ 1612.96 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు ఉండగా.. 34.82 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది.
టీబీ డ్యాంకు స్థిరంగా వరద
అయిజ : కర్ణాటకలోని టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతున్నది. డ్యాం ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో స్వల్ప ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. మంగళవారం తుంగభద్ర జలాశయంలోకి ఇన్‌ఫ్లో 6,647 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఔట్‌ఫ్లో 1,439 క్యూసెక్కులుగా ఉన్నది. ఏపీ, కర్ణాటక తాగునీటి అవసరాలకు ఎల్ఎల్సీ, ఎల్‌బీఎంసీ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 39.757 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1633 అడుగుల నీటిమట్టానికిగానూ 1612.26 అడుగులుగా నమోదైనట్లు డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
సుంకేసులకు తగ్గిన ఇన్‌ఫ్లో
రాజోళి : సుంకేసుల జలాశయానికి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఎగువ నుంచి 9700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. రెండు గేట్ల ద్వారా 8700 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. కేసీ కాల్వకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జేఈ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
శ్రీశైలం @ 90.77 టీఎంసీలు
శ్రీశైలం: శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాం తాల నుంచి వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జూరాల నుంచి 12,747 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 8,690 క్యూసెక్కులు, హంద్రి నుంచి 1,125 క్యూసెక్కుల నీరు జలాశయానికి విడుదల చేశారు. డ్యాంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగానూ 854.500 అడుగుల మేర నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 90.5596 టీఎంసీలుగా నమోదైంది. ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. 40,259 క్యూసెక్కుల నీటితో విద్యుదుత్పత్తి జరుగుతున్నది. కుడిగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరగడం లేదని అధికారులు తెలిపారు. ఎడమ గట్టు కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి వరకు 6 యూనిట్ల ద్వారా సుమారు 43,134 క్యూసెక్కుల నీటిని వినియోగించి 20.724 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు సీఈ ప్రభాకర్‌రావు తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు స్వల్ప వరద
అయిజ : కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాజోళి బండ డైవర్సన్ స్కీం (ఆర్డీఎస్ ఆనకట్ట)కు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. మంగళవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 6 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 6 వేల క్యూసెక్కుల వరద ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ప్రస్తుతం ఆనకట్టపై నుంచి అర అడుగు మేర నీరు దిగువకు ప్రవహిస్తోందని కర్ణాటక ఆర్డీఎస్ ఈఈ రామయ్య తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 8.8 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
- అధికారులను కొట్టాలన్న.. కేంద్రమంత్రి వ్యాఖ్యలపై నితీశ్ స్పందన
- సర్కారు బెంగాల్‌కు వెళ్లింది, మేమూ అక్కడికే పోతాం: రైతులు
- ‘మల్లన్న ఆలయంలో భక్తుల సందడి’
- మహిళా ఉద్యోగులకు రేపు సెలవు : సీఎం కేసీఆర్
- ఆ సినిమాలో నా రోల్ చూసి నాన్న చప్పట్లు కొట్టాడు: విద్యాబాలన్
- విడుదలకు ముస్తాబవుతున్న 'బజార్ రౌడి'
- కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి
- ‘కార్తికేయ 2’లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్
- టీడీపీ నేతల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైంది : చంద్రబాబు
- పాకిస్తాన్లో హిందూ కుటుంబం దారుణహత్య