గురువారం 03 డిసెంబర్ 2020
Food - Nov 19, 2020 , 19:06:07

డీప్ ఫ్రై కోసం ఈ నూనెలు వాడితే మంచిదట..!

 డీప్ ఫ్రై కోసం ఈ నూనెలు వాడితే మంచిదట..!

హైదరాబాద్: వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు.. వేడి వేడిగా ఏదో ఒకటి తినాలని మనసు వెంపర్లాడుతుంటది. డీప్ ఫ్రై చేసినవి అయితే ఇంకా బాగుండు అనిపిస్తుంది. వేడి వేడి పకోడి, మంచి మిర్చీ బజ్జీ లేదా బోండా, గారె ఇలాంటివి తినాలని ఆశ ఎక్కువమందికి ఉంటుంది. ఇవన్నీ డీప్ ఫ్రే చేసేవే. వీటితో పాటు చాలా మంది  ఫ్రై కర్రీలు తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఇవన్నీ చేసుకుని తినాలనే ఆశ ఎంత ఉంటుందో అంతకు రెండు రెట్లు భయం కూడా ఉంటుంది. ఎందుకంటే నూనె ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని. నూనె శరీరంలోని కొవ్వును పెంచి ఊబకాయం, గుండె సమస్యలు లాంటి వాటికి కారణమవుతుంది. అయినా అప్పుడప్పుడు తింటుంటాం. 

అయితే డీప్ ఫ్రై చేయడం అంటే మనం తినే పదార్థాన్ని పూర్తిగా నూనెలో ముంచి తీసుకుని తింటున్నట్లే. అదే డేంజర్ అంటుంటే చాలా మంది డీప్ ఫ్రై కోసం వాడిన నూనెను మళ్లీ వంటల్లోకి వాడుతుంటారు. ఒకసారి మరిగిన నూనెను మళ్లీ మరిగించుకుని తినడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి వేడక్కిన నూనెను మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల అది దాని సహజత్వాన్ని కోల్పోతుందట. దానిలో ఉండే కోటింగ్ పొయ్యి.. మనం డీప్ ఫ్రే చేసిన ఆహారాన్ని అనారోగ్యభరితం చేస్తుందట. అందుకే ఒకసారి వాడిన నూనెలు మళ్లీ మళ్లీ వాడకూడదట. అంతేకాదు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఉపయోగించకూడని నూనెలు కూడా కొన్ని ఉంటాయట.అవేంటో తెలుసుకుందాం.. 

* డీఫ్ ఫ్రై కోసం వాడాల్సిన నూనెలు

- కొబ్బరి నూనె

కొబ్బరి నూనెతో వంట చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని మనకు ఎప్పటినుంచో వైద్యులు చెబుతూనే ఉన్నారు. అలాగే డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా కొబ్బరి నూనె చాలా మంచిదట. దీంట్లో 90శాతం సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒంట్లో వేడిని తగ్గిస్తాయట. దాదాపు 8 గంటల పాటు ఈ నూనెనె వేడి చేసినా దీని సహజత్వాన్ని కోల్పోదట. కాబట్టి డీప్ ఫ్రే చేసుకోవడానికి కొబ్బరి నూనె వాడితే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే దీని వాసన, రుచి వేరుగా ఉంటాయి కాబట్టి అందరికీ నచ్చపోవచ్చని చెబుతున్నారు.

-నెయ్యి లేదా కొవ్వు

జంతువుల కొవ్వు నుంచే తీసే నెయ్యి లాంటి వాటితో డీప్ ఫ్రై చేసుకోవడానికి మంచిదట. వీటితో చేసిన వంటలు బాగా రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదట. వీటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ మోనోఅన్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయట. ఇవి శరీరంలో వేడి పెరకుండా కొవ్వు పేరుకుపోకుండా ఉండేందుకు సహాయ పడుతుందట. 

- ఆలివ్ ఆయిల్

- అవకాడో ఆయిల్

- పీనట్ ఆయిల్

-పామ్ ఆయిల్

*ఇక డీప్ ఫ్రై కోసం వాడకూడని నూనెలు

- సోయాబీన్ ఆయిల్

- సాఫ్ ఫ్లవర్ ఆయిల్

- రైస్ బ్రాన్ ఆయిల్

-సన్ ఫ్లవర్ ఆయిల్

-సెసమీ ఆయిల్

ఇవి డీప్ ఫ్రై కోసం కానీ ఫ్రై కర్రీలకు కానీ వాడకూడని నూనెలు. వీటిని ఉపయోగించడం వల్ల పాలీస్యాచురేటెడ్, ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి హాని చేస్తాయట. కాబట్టి డీప్ ఫ్రై చేసుకునే ముందు ఈ నూనెలు వాడుతున్నామో లేదో చూసుకుని చేసుకుండి.స్వీట్ ఎంతమోతాదు తీసుకోవాలంటే...!

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.