శనివారం 23 జనవరి 2021
Food - Aug 25, 2020 , 18:17:06

గుప్పెడు వాల్‌న‌ట్స్ తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా? ఆ స‌మ‌స్య‌కు దూరం!

గుప్పెడు వాల్‌న‌ట్స్  తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా? ఆ స‌మ‌స్య‌కు దూరం!

అంద‌రినీ అనారోగ్యానికి దారితీసే వ్యాధి డ‌యాబెటిస్‌. ఇది వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రికీ వ‌స్తున్న‌ది. షుగ‌ర్ వ్యాధి రావ‌డం వ‌ల్ల న‌చ్చిన ఆహారం తిన‌డానికి కూడా వీలు ప‌డ‌దు. చ‌క్కెర వ‌స్తువులు అస‌లే తిన‌కూడ‌దు. ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలి, చెడు అల‌వాట్ల వ‌ల‌నే డ‌యాబెటిస్‌కు గుర‌వుతున్నారంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక‌సారి షుగ‌ర్ వ్యాధి వ‌స్తే జీవితాంతం దానిని అనుభ‌విస్తూ ఉండాలి. శ‌రీరానికి స‌రైన ఇన్సులిన్ అంద‌క అస్వ‌స్థ‌కు గుర‌వుతారు. బాడీలో షుగ‌ర్ లెవ‌ల్స్ ఎలా ఉన్నాయో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.

డ‌యాబెటిస్ టైప్‌-2 బారిన ప‌డిన‌వారు వాల్‌న‌ట్స్ తిన‌డం వ‌ల్ల బ‌య‌ట ప‌డొచ్చు. రోజుకు 3 టేబుల్ స్పూన్ల వాల్‌న‌ట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల 47 శాతం త‌గ్గుతుంద‌ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు వెల్లడించారు. మ‌ధుమేహం ఒక‌టే కాదు క‌రోనా టైంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డానికి కూడా వాల్‌న‌ట్స్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. మ‌రింకెందుకు ఆల‌స్యం వాల్స్‌న‌ట్స్ తిని ఆరోగ్యంగా ఉండండి. 


logo