శుక్రవారం 15 జనవరి 2021
Food - Dec 03, 2020 , 13:37:49

క‌రోనాపై పోరాటానికి, వ్యాప్తి నిరోధానికి ఇవే బెస్ట్ ఫుడ్‌

క‌రోనాపై పోరాటానికి, వ్యాప్తి నిరోధానికి ఇవే బెస్ట్ ఫుడ్‌

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్‌పై పోరాడేందుకు అది వ్యాప్తి చెంద‌కుండా ఉండేందుకు నిపుణులు అత్యుత్త‌మ ఎనిమిది ఆహార ప‌దార్థాల‌ను క‌నుగొన్నారు. క‌రోనా వైర‌స్‌కు గురికాకుండా ఉండేందుకు, కొవిడ్‌-19 త‌గ్గించేందుకు సాధ్యమైనంత ఉత్తమ పోరాట విధానాల‌ను ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ కొన్ని ఆహార చేరికలతో మ‌నం వైర‌స్‌పై స‌మ‌ర్థ‌వంత‌మైన పోరాటం చేయొచ్చంటున్నారు నిపుణులు. నార్త్ కరోలిన్ స్టేట్ యూనివర్శిటీ చేసిన కొత్త పరిశోధన కొరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి సహాయపడే కొన్ని ఆహారాలు, పానీయాల గురించి కనుగొంది. ఫ్లేవనాల్ అధికంగా ఉండే ఆహారాలలోని రసాయన సమ్మేళనాలు కొత్త కరోనా వైరస్ కణాలలో కొన్ని ఎంజైమ్‌లను ప్రతిరూపం చేయకుండా నిరోధించవచ్చని బృందం క‌నుగొంది. 

ఈ అధ్యయనంలో ఫ్లేవనాల్ సమ్మేళనాలు అధికంగా ఉన్న 8 ఆహారాలు ఈ విధంగా ఉన్నాయి:

- గ్రీన్ టీ

- డార్క్ చాక్లెట్

- ద్రాక్ష

-కోకో గింజలు

- స్ట్రాబెర్రీ

- క్రాన్బెర్రీ

- బ్లూబెర్రీ

- పెర్సిమోన్

పైన పేర్కొన్న అన్ని ఆహారాలకు సమర్థవంతమైన ఫ్లేవనోల్స్‌గా పేరు ఉన్న‌ప్ప‌టికీ పరిశోధకులు గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్, కోకో గింజలు, ద్రాక్ష అనే ఈ నాలుగు ఆహారాలపై మాత్రమే అధ్యయనం చేశారు.