శుక్రవారం 10 జూలై 2020
Food - Mar 03, 2020 , 22:40:38

ఉప్పు ఎక్కువైతే?

ఉప్పు ఎక్కువైతే?

  • సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువైతే.. సగం తరిగిన ఆలూముక్కను సూప్‌లో వేయాలి. 15 నిమిషాల తర్వాత తక్కువ మంటతో వేడిచేస్తే సరిపోతుంది. తర్వాత ఆలుముక్కను తీసేయొచ్చు.
  • పుదీనా, మిరియాలపొడి వంటి వాటిని సూప్‌లలో ఎక్కువగా చేర్చండి. అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది.
  • సూప్‌లు చిక్కగా రావాలంటే.. మీకు నచ్చిన కూరగాయల్ని ఉడికించి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయండి. దాన్ని సూప్‌లో కలిపితే బాగుంటుంది.
  • ఖాళీ అయిన నెయ్యి, నూనె ప్యాకెట్లలో పప్పులు ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 
  • ధనియాలు పరుగు పట్టకుండా ఉండాలంటే వాటిని కడాయిలో కాసేపు వేడిచేసి ఆపై డబ్బాలో నిల్వచేస్తే చాలాకాలం వరకు నిల్వ ఉంటాయి.


logo