నేను నా కాలు మీద నా కాలే వేసుకున్న, కానీ మీకెందుకో ‘కాలు’తుంది
నా కాలుని ఇంకో కాలైతే మోస్తుంది కానీ వాటి బరువు మీ అహంకారం మీద పడినట్లుంది, అందుకే ఓర్చుకోలేక అసహనంతో ‘చేయి’ లేపాలనిపిస్తుంది
ఒక చెంపకి ఇంకో చెంప చూపాలనే సహనం నేర్పిన మహనీయులు పుట్టిన గడ్డ మీద, ఒక కాలు మీద ఇంకో కాలు వేస్తే చెంప పగలగొట్టాలనిపించే అసహనం మీకు ఎందుకు వస్తుంది? ఎందుకంటే మీలో నిలువెల్లా ప్రవహించేది ఫ్యూడల్ భావజాలం కనుక..
ఎదుటివాడు పచ్చగా కనపడ్డా, కనీసం హుం దాగా కూర్చున్నా కూడా ఓర్వలేని గుణం ఉండేది ఫ్యూడలిస్టులకి మాత్రమే. ఈ లెక్కన మీ ఫ్యూడల్ అహంకారానికి పరాకాష్ఠ నిన్నటి మీ వ్యాకులత.
మీ ఫ్యూడల్ మనోవైకల్యానికి ఆదర్శం అనే కృత్రిమ అవయవం అమర్చి ఏమార్చినా, అప్పుడప్పుడు ఇచ్చే మీ నిజరూప దర్శనం తెలంగాణ సమాజానికి కనువిప్పు లాంటిది.
ఒక తెలంగాణ విలేకరి మీ ఎదుట కాలు మీద కాలు వేసుకున్నా ఓర్వలేని మీరు, అదేందో మరి తెలంగాణ విరోధుల స్టూడియోలకి వెళ్లి వాళ్లు కుర్చీలో కూర్చొని కాళ్లు ఎగరేసుకుంటూ విసిరేసిన పూల బొకేలని ఘనసత్కారాల్లా అందుకొని మురిసిపోతారు.
మీ లక్షణాలు, లక్ష్యాలు ఒక్కోటి వ్యక్తం అవుతున్న కొద్ది మీరు నల్లమల మృగరాజు కాదు మృగధూర్తులు అని తెలంగాణ సమాజానికి తేటతెల్లం అవుతూ వస్తుంది.
మీది ఫాసిస్టు బుద్ధే కాదు, పాపిష్టి బుద్ధి కూడా.
– మీ కాదాసు (ఓ సగటు విలేకరి స్పందన)