SYG | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలంగా తెరపై కనిపించని ఆయన, ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి మొదట సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినప్పటికీ, అదే రోజు పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ విడుదల కావడంతో రిలీజ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది అన్న వార్తలు వినిపించాయి. అంతేకాక, సినిమా షూటింగ్ పూర్తిగా పూర్తి కాలేదనే టాక్ కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ అంశాలపై అధికారికంగా మేకర్స్ స్పందించనప్పటికీ, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను విడుదల చేశారు.దసరా పండుగ శుభాకాంక్షలతో ప్రీ గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ అక్టోబర్ 15, 2025న సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేమయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ అప్డేట్తోపాటు కొత్త రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. సాయి ధరమ్ తేజ్ లుక్ ఇందులో పూర్తిగా డిఫరెంట్‌గా ఉండబోతుందని సమాచారం. ఇది ఒక మాస్ & ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుండగా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం పోస్టర్లు, మేకింగ్ వీడియోలు అలరిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం నుండి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్లు వెలువడే అవకాశముంది. అక్టోబర్ 15న వచ్చే గ్లింప్స్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ చిత్రంతో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి హిట్ కొడతాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ నిన్నటితో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
The Arrival 🔥 https://t.co/DRRsEQbeng
— Rohith KP (@rohithkp_dir) October 2, 2025