realme 15x 5G | భారీ బ్యాటరీ, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లతో లాంచ్ అయిన రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..?
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం భారీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్లనే చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే అలాంటి ఫోన్లలో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి.
realme 15x 5G | ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం భారీ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్లనే చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే అలాంటి ఫోన్లలో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి. ఒకప్పుడు ఈ ఫీచర్ కేవలం ఫ్లాగ్ షిప్ ఫోన్లలోనే లభించేది. కానీ ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్లలోనూ దీన్ని అందిస్తున్నారు. అందులో భాగంగానే భారీ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో రియల్‌మి ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మి 15ఎక్స్ 5జి పేరిట ఈ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేశారు. ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుండగా, ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. రియల్‌మి 15ఎక్స్ 5జి స్మార్ట్ ఫోన్లో 6.8 ఇంచుల ఎల్సీడీ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. కనుక డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను అదనంగా మరో 10 జీబీ వరకు వర్చువల్‌గా పెంచుకునే వీలు కల్పించారు. కనుక ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి గాను 2 ఏళ్ల వరకు ఓఎస్ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు సైతం 50 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు గాను ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ నాణ్యతతో ఈ ఫోన్‌ను రూపొందించారు. కనుక ఫోన్ చాలా క్వాలిటీగా, దృఢంగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు మన్నికగా పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇదే ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. అలాగే 60 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ లభిస్తుంది. 80వాట్ల ఫాస్ట్ చార్జర్‌ను ఫోన్‌తోపాటు బాక్స్‌లో అందిస్తున్నారు.
400 శాతం ఎక్కువ వాల్యూమ్..
6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పక్క భాగంలో ఇచ్చారు. అల్ట్రా లినియర్ బాటమ్ పోర్టెడ్ స్పీకర్ ఉంది. దీని వల్ల 400 శాతం ఎక్కువ అధిక వాల్యూమ్‌ను పొందవచ్చు. ఈ ఫోన్లో 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా లభిస్తుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
ధర వివరాలు..
రియల్‌మి 15ఎక్స్ 5జి ఫోన్‌ను ఆక్వా బ్లూ, మెరైన్ బ్లూ, మరూన్ రెడ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్, రియల్‌మి ఆన్లైన్ స్టోర్, ఇతర ప్రధాన రిటెయిల్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు. లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను సైతం అందిస్తున్నారు. యూపీఐ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు ధర లభిస్తుంది. బ్యాంకు ఆఫర్ ద్వారా అయితే రూ.1000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.3000 పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

