మానవాళికి వచ్చే అనేక రోగాలకు ‘చేతుల అపరిశుభ్రత’నే కారణం. ‘పరిశుభ్రత’ అనేది ప్రతిరోజు చేసే
ఒక సాధారణ ప్రక్రియ. కానీ చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేక ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు. చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల అనేక రోగాల బారిన పడుతుంటారు. ఏ వస్తువును తాకినా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవటం అనే ప్రక్రియ కరోనా కాలంలో ప్రతి మనిషికి అలవాటుగా మారింది. కరోనా మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరికి అలవాటైన ఈ ప్రక్రియ ‘చేతులు కడుక్కోవడం వల్ల ఒక్క తమకే కాదని, తమ పరిసరాల్లోఉన్న ఇతరులకూ మంచి జరుగుతుందని తెలియజేసింది.
వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ‘చేతులు కడుక్కోవడం’ ప్రాముఖ్యం ఎక్కువగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ‘స్వీడన్‌లోని కగాయన్ డీ ఒరోలిని సిటీ సెంట్రల్ పాఠశాలలో 2008లో మొట్టమొదటిసారిగా ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ను ప్రారంభించారు. అప్పటినుంచి ఏటా అక్టోబర్ 15న ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ జరుపుతున్నారు. ప్రస్తుత సమయంలో ముఖ్యం గా క్లిష్టమైన సమయంలో సబ్బుతో చేతులు కడుక్కోవడానికి, ప్రోత్సహించడానికి, సృజనాత్మక మార్గాలు రూపొందించే అవకాశం ఉన్నది. ఇది నిజంగా ఒక విలువైన సందేశంగా చెప్పవచ్చు. ‘హ్యాండ్ వాష్’ అనేది ప్రాణాలను కాపాడుతుంది. పాఠశాలలు, దవాఖానలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, పౌర సమాజ సంస్థలు ఈ విషయాన్ని ఆమోదించాయి. అందుకే ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’కు ఇంత ప్రాధాన్యం పెరిగింది. 2008లో ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల మందికి పైగా పిల్లలు, 70కి పైగా దేశాల్లో సబ్బుతో చేతులు శుభ్రం చేసుకున్నారు. ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ను మూడు లక్ష్యాలుగా విభజించవచ్చు. 1.సబ్బుతో చేతులు కడిగే సంస్కృతిని సృష్టించడం 2.ప్రతి దేశంలో హ్యాండ్ వాషింగ్ స్థితిపై అవగాహన కల్పించడం. 3. చేతులు కడగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయడం.
‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ ను ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్‌తో ప్రారంభిస్తారు. 2021లో ‘క్లీన్ హ్యాండ్స్‌తో లైఫ్ బెటర్’ అని ప్రచారం చేశారు. ఈ పరిశుభ్రత ప్రచారం తల్లిదండ్రులు, సంరక్షకులు ఉన్న పెద్దలను లక్ష్యంగా చేసుకొని ‘హ్యాండ్ వాష్’ ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి మురికి చేతులు కడుక్కోవడానికి సదుపాయాలు లేవని అంచనా. చేతుల పరిశుభ్రత వల్ల డయేరియా, అనారోగ్యకరమైన జలుబు, ఫ్లూ, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా నివారించవచ్చు. చేతులను సబ్బుతో కనీసం 40 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు శుభ్రం చేసుకోవాలి. చేతులను 7 దశలుగా శుభ్రం చేసుకోవాలి. మన చేతిలో ఒక సెంటీమీటర్లో 1500 బ్యాక్టీరియాలుంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ అంచనాల ద్వారా తెలిసింది. 2015లో 54 దేశాల్లో చేతులు కడుక్కోవడంపై జరిపిన అధ్యయనంలో సగటున 38.7 శాతం గృహాలు సబ్బుతో కడుక్కోవడం అభ్యసించాయి.
చేతులను సబ్బు, నీటితో కలిపి కనీసం 20 సెకన్ల పాటు కడగాలి. దగ్గు లేదా తుమ్మిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ప్రజా రవాణాలో బహిరంగ ప్రదేశాలను సందర్శించిన తర్వాత చేతులు కడుక్కోవాలి. వస్తువులను తాకిన తర్వాత, అనారోగ్యానికి గురైన వ్యక్తులను చూసుకునే ముందు, తర్వాత కూడా శుభ్రం చేసుకోవాలి. భోజనం చేయడానికి ముందు, చేసిన తర్వాత సబ్బుతో కడుక్కోవాలి. టాయిలెట్స్ ఉపయోగించిన తర్వాత, చెత్తను నిర్వహించిన తర్వాత కూడా పరిశుభ్రతను పాటించాలి. జంతువులను, పెంపుడు జంతువులను తాకిన తర్వాత, కానీ చేతులు మురికిగా ఉన్న ప్రతి సందర్భంలో సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే వంట చేయడానికి ముందు, ఆహారం ఇతరులకు వడ్డించే ముందు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో దస్ర్తాలు తీసిన తర్వాత, పరిశోధనలు చేసిన తర్వాత సబ్బుతో కానీ శానిటైజర్ తో కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) 2022 సంవత్సరాన్ని అందరూ ‘హ్యాండ్ హైజీన్ థీమ్’తో ముందుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం విరేచనాలతో బాధపడే వారి సంఖ్యను తగ్గించాలి., అనారోగ్య కారణంగా పాఠశాలల్లో పిల్లల గైర్హాజరు శాతాన్ని తగ్గించాలి. అతిసార అనారోగ్యాన్ని 50 శాతం తగ్గించాలి. సాధారణ జనాభాలో జలుబు నుంచి శ్వాసకోశ అనారోగ్యాలు 16 నుంచి 20 శాతానికి తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయా దేశాలకు డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రమైన నీరు, సబ్బు, శానిటైజర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్బుతో చేతులు కడుక్కోవడం సరళమైనది, చవకైనదే కాకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్యం గురికాకుండా కాపాడవచ్చు. ఈ విషయంలో ఆరోగ్యకార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులు, ప్రజలు అంటువ్యాధులు నిర్మూలించడంలో భాగస్వామ్యం కావాలి. వారి సూచనలు పాటిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే ఎలాంటి వ్యాధులు తమ దరిచేరవనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రజలు తమ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు పాటించినప్పుడే ఆరోగ్య సమాజం నిర్మాణమవుతుందని తెలుసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. వీలు చిక్కినప్పుడల్లా చేతులు కడుక్కోండి, జీవితాలను రక్షించుకోండి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రమైన నీరు, సబ్బు, శానిటైజర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్బుతో చేతులు కడుక్కోవడం సరళమైనది, చవకైనదే కాకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్యం గురికాకుండా కాపాడవచ్చు. ఈ విషయంలో ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులు, ప్రజలు అంటువ్యాధులు నిర్మూలించడంలో భాగస్వామ్యం కావాలి.
కామిడి సతీశ్‌రెడ్డి: 98484 45134