ఎవరన్నారు
‘ఢిల్లీ దూర్ హై’.. అని
తెలంగాణ ధీరుడు అడుగు పెట్టారుగా
ఎకసెక్కాలు ఎప్పుడు లేవని
వెనక్కి లాగే కప్పలు కుప్పలుగా
ముందుకే దూకితే విజయం మనదే కదా
లక్ష్యం ఎప్పుడూ కొత్తగా
దారి కొత్తది వేసుకుంటూ వెళ్లాల్సిందే
తాటాకు చప్పుళ్లు చప్పబడతాయి ఆ రోజు
కొడితే కొట్టాల్సిందే
ఢిల్లీ గద్దెను ఎక్కాల్సిందే
డబుల్ ఇంజిన్ ఈసారి బీఆర్ఎస్దే సుమీ
పథకాలు ప్రచారం చేస్తాయి
ప్రజల దీవెనలు దూకుడు పెంచుతాయి
దేశం అంతా ఎర్ర తివాచీ పరుస్తుంది
విశ్వాసం అహాలను వంచుతుంది
ప్రపంచం నివ్వెర పోవు గాక
ప్రధాన మంత్రి పదవిలో కేసీఆర్ కూర్చున్నాక..
దాసరి మోహన్: 99853 09080