అమావాస్యదో పక్షం
పౌర్ణమిదో సగం
అది ఖగోళ వైనం..
నా తెలంగాణ తద్భిన్నం!
అరవయ్యేండ్ల చీకట్లకు మంగళం
ఎనిమిదేండ్లుగా వెన్నెల మయం…
నిన్న మొన్నటి.. నేటి రేపటి తరం
రంది లేని బతుకుల తీరం
ఎన్నో ఉపాయాల ఫలితం…
వెలితి తీర్చిన కాళేశ్వరం
ఇల్లూ పొలమూ సుభిక్షం
ప్రతి కుటుంబమూ శ్రీమంతం…
కంకణధార పాలన యాగం
ఉద్యోగ ఉపాధి యోగం
సకలజనుల సంతోషం…
చల్లని చంద్రుడి నేతృత్వం
మన రాష్ట్ర రక్షా కవచం
యావద్దేశానికే నిర్దేశం…
కన్ను కుట్టిన కేంద్రం
క(న)ష్టపెట్టే యత్నం
కుదరదిక్కడ పన్నాగం..
కేసీఆర్ మన అదృష్టం
ఐక్యంగా నిలబడదాం
అదే మనందరి చైతన్యం..!
– దుర్గాప్రసాద్ ఇల్లెందుల,
94408 50384