సీ. జయమను జయజయ జనగణ నినదమ్ము
మన తెలగాణపు మకుట మయ్యె
వెలుగుల గములవి నలుదెస లలరిన
భయపడి తిమిరము పరుగు తీసె
జలజల పారెడు జలసిరి తిలకించి
దూప దూపను మాట తోక ముడిచె
కొలువుల తలపుల నెలవులలో చేరి
పోటీ పరీక్షల రాటు దేలు
తే.గీ. యువత తెలగాణ రాష్ట్రపు భవిత నేడు
దళిత రైతు బంధు పథకాల దారులవ్వి
పేద వారిని పోషించు పెద్ద నిధులు
చంద్ర శేఖరు దాతృత్వ జ్ఞాన ఖనులు
-డాక్టర్ శాస్ర్తుల రఘుపతి,
73867 58370