పచ్చని పంటచేలు ఘన పచ్చడమై
విలసిల్లనన్యులున్
మెచ్చిన సంస్కృతీ విభవమే నడయై
వెలుగొంద నెల్లెడల్
స్వచ్ఛత గల్గి ప్రాణులకు
సౌఖ్యమొసంగెడి గాలి దాహమ
న్చిచ్చును మాన్పి హాయినిడు
శీతజలంబుల పల్లెటూళ్లతో
నచ్చపు స్వర్గధామముగనా
భరతాంబిక వెల్గు నిక్కమున్
చదువులయందు తద్విమల
సారములందు ప్రశస్త శాస్త్ర సం
వందనమునందు ధర్మ
పరివర్తనమందు సరాగమందునన్
కదనమునందు వైరి
తలఖండనమందు కళా ప్రదర్శనా
స్పదమున భారతావనికి
సాటికలేదు సమస్త విశ్వమున్
వేదంబుల్ జనయించె వైద్య
గరిమన్వెల్గొందె నాకాశమున్
పాదంబెట్టెను శాటిలైటు
విధమున్పారీణతన్ వ్యూహముల్
ఛేదించంగ వివేకమబ్బె రహి
భాసిల్లెన్ పరంధామునా
రాధించంగ పథంబు జూపె
భరతారామంబు దివ్యాకృతిన్
భారత మాతకున్ వినుత
పావనమూర్తికి దివ్యధాత్రికిన్
వీరుల గన్న తల్లికి వివేక ప్రభామయ భావ దీప్తికిన్
సారస కీర్తికిన్ నిరత శాస్త్ర నికేతన
భాసితాంగికిన్
కోరి శిరంబువంచి శతకోటి
నమస్సుల నందజేసేదన్
– అమరవాది రాజశేఖరశర్మ