ఈ నెల 24న మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ జబిందా మైదానంలో జరిగిన బీఆర్ఎస్ భారీ సభలో వినిపించిన గేయపు సారాంశమిది. కేసీఆర్‌పై గంపెడు ఆశతో మార్పు కోసం వేచి చూస్తున్న మరాఠాల మనోగతమిది. ఇంత ఆశ, ఇంత సంకల్పం, ఎందుకంటే… వారు నిలువునా మోసపోయి వున్నరు. పార్టీలు ఏవైనా కానీ, ప్రభుత్వాలు ఎన్నైనారానీ, వారి బతుకైతే మారలేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉండగా, ఎక్కడా లేనన్ని నదులు పారుతూ ఉండగా కూడా రైతుల ఆత్మహత్యలు, కూలీల వలసలు, అరకొర బతుకులు, అత్తెసరు ఆశలు-ఇదీ ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతం వారికిచ్చినది. సరిగ్గా తొమ్మిదేండ్ల కింద అచ్చు తమలాగే ఉన్న పక్క రాష్ట్రం తెలంగాణ నేడు జగజ్జేయమైన వెలుగులీనుతూ ఉంటే, తామెందుకు చీకట్లో మగ్గుతున్నం అనేది వారి వ్యథ.
వారికి కేసీఆర్ భరోసా ఇచ్చిన్రు- నయా ఢంగ్, నయా రంగ్, నయా జంగ్ అని! ఆయనకు తనపైనా, ప్రజలపైనా ఎంత విశ్వాసం అంటే.. ‘తెలంగాణలో ఇస్తున్న అన్ని పథకాలు ఇక్కడ మీరు ఇవ్వండి ఫడ్నవీస్, నేనిక మహారాష్ట్రకు రాను’ అనగలిగిన్రు! ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మిడతల దండులా వాలిపోయే పార్టీ బీజేపీ. ఎక్కడ వెనుకబాటుతనం ఉంటే అక్కడ కాలూని, సమూలంగా మార్చగలిగే సాహసి, సమర్థ నాయకుడు కేసీఆర్.
ఒక్క మహారాష్ట్ర అనే కాదు, దేశమంతా నే డు తెలంగాణ వైపు ఆశతోఎదురు చూస్తున్నది. పలు రాష్ర్టాలకు చెందిన ఎందరో అధికార పా ర్టీల ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని తీర్మానాలు చేస్తున్నరు. నిజానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయినంక, రా బోయే రోజుల్లో దేశమంతా తెలంగాణ మాడల్ విస్తరించనుండగా ఏ ప్రాంతాన్నీ తెలంగాణలో కలపవలసిన అవసరం లేదిక. తాజాగా రాయలసీమ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తమ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ చేద్దాం అన్నరు. ఆయనకు వినతి: అన్నా! రాయల్ భారత్ సాకారం చేసుకుందాం!
‘ప్రపంచంలోని అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తుంటే, అత్యధిక సంఖ్యలో పేదప్రజలు భారతదేశంలోనే ఉండటం విచారకరం’ అన్నరు మొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ వేణుగోపాలరెడ్డి. కాబట్టే.. కేసీఆర్ పాలన దేశానికి అవసరం అంటున్నం!
మితృలారా! టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పోయినేడు ఇదే రోజు ఈ పేజీలో ‘దేశ నిర్మాణం కోసం పునరంకితం’ శీర్షికన సంభాషించుకున్నం. పార్టీ పేరు సహా ఈ సంవత్సర కాలంలో ఏమి మారింది అని ఒకసారి అవలోకనం చేసుకుందాం. గతపు
వెలుగులోనే భవిష్యత్ పట్ల వర్తమానపు చూపు నిలవాలి!
తెలంగాణకు ముఖ్యమంత్రి అయినాక కూడా రాయలసీమకు నీళ్ళు ఇస్తమని కేసీఆర్ చెప్పింది ఎందుకంటే, ఎవరూ కనీస అవసరాలకు అల్లల్లాడకూడదని. మనకంటే ఎన్నోరెట్లు చిన్న దేశాలు వెలిగిపోతూ వుంటే, పరస్పర వీధి కొట్లాటల దౌర్భాగ్యం మనకెందుకని? మహారాష్ట్రతో ఏండ్లపాటు కొనసాగిన జల వివాదాన్ని రెండు టీఎంసీలు వారికి ఇచ్చేసి ముగించినది అందుకే. విశాలదృష్టీ, హృదయమూ ఉన్న నాయకత్వంతోనే అద్భుతాలు జరిగేది! ఇవన్నీ మేము కేసీఆర్ మానస పుత్రులుగానో, బీఆర్ఎస్ కార్యకర్తలుగానో మాత్రమే చెప్పడం లేదు. మొన్నటిదాకా అత్యంత వెనుకబడ్డ తాండూరు ప్రాంతవాసులుగా కునారిల్లిన మేము.. ఇపుడు తాండూరు రూపురేఖలు మారిన విజయగర్వంతో చెపుతున్నం. కల్లబొల్లి మాటలు కాదు, సాకారమైన కలల సాక్షిగా చెపుతున్నం. మా కందిపప్పుకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. మా కాలుష్యం మాయమైంది. కర్ణాటక సరిహద్దు గ్రామమైన మా ఇందర్చేడ్లో 8 లక్షలు కూడా పలకని భూములు 26 లక్షలు అయినయి ఎకరాకు. మా ప్రభుత్వ దవాఖాన కార్పొరేట్ హాస్పిటల్‌కు దీటుగా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు నాణ్యతతో వెలిగిపోతున్నయి. సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు, అభివృద్ధికి దూరంగా పల్లె లేదు.
తెలంగాణకు ముఖ్యమంత్రి అయినాక కూడా రాయలసీమకు నీళ్ళు ఇస్తమని కేసీఆర్ చెప్పింది ఎందుకంటే, ఎవరూ కనీస అవసరాలకు అల్లల్లాడకూడదని. మనకంటే ఎన్నోరెట్లు చిన్న దేశాలు వెలిగిపోతూ వుంటే, పరస్పర వీధి కొట్లాటల దౌర్భాగ్యం మనకెందుకని? మహారాష్ట్రతో ఏండ్లపాటు కొనసాగిన జల వివాదాన్ని రెండు టీఎంసీలు వారికి ఇచ్చేసి ముగించినది అందుకే. విశాలదృష్టీ, హృదయమూ ఉన్న నాయకత్వంతోనే అద్భుతాలు జరిగేది!
ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా జరిగినయి తాండూరులో. ఇక్కడ మాట్లాడుకున్న ప్రతి అంశమూ ఇంటింటా చర్చించుకోండి అని చెప్పినం. మా రెండు మండలాల మీటింగ్‌లకు వచ్చిన జనం మొన్న అమిత్ షా మీటింగ్ కంటే ఎక్కువ. ఆశ్చర్యం ఏమంటే, బీఆర్ఎస్ పార్టీ కానివారు కూడా పాల్గోవడం. ‘ఇది అందరి పండుగ కదా, మీ పార్టీది మాత్రమే కాదు. మాకు అందరికీ కేసీఆర్ ఇస్తున్నాడు కదా’ అని బషీరాబాద్ మండలం కాశింపూర్‌లో కాంగ్రెస్ కండువా వేసుకున్న ఒక వ్యక్తి అనడం బీఆర్ఎస్కు సిసలైన సర్టిఫికెట్. అట్లనే, ఈ రోజు జరుపుకొంటున్న 22వ ప్లీనరీ కూడా తెలంగాణ వాసులందరిదీ. నేడు కేసీఆర్ ఇవ్వబోయే సందేశం దేశ ప్రజలు అందరికీ. మిత్రులారా! మీరు కన్విన్స్ కాకపోతే, మరింత చర్చించుకుందాం. కన్విన్స్ అయితే.. దేశాన్ని మార్చే పనిలో పడుదాం. సిద్ధమే కదా?
జై భారత్!
పైలట్ రోహిత్ రెడ్డి (ఎమ్మెల్యే)
శ్రీశైల్ రెడ్డి పంజుగుల: 90309 97371