తగ్గేదే లేదు
తలొగ్గేదే లేదు
ఇరగదీస్తం
తిరగ రాస్తం
గల్లీ నుండి ఢిల్లీ దాకా మాదే
దిగజారుడు రాజకీయాలపై ప్రత్యక్ష రణం
ప్రభాత కాల సూర్య కిరణాలం
కదన భీతి లేదు
కదలుతాం నదిలా, ఉదధిలా
నిత్య పోరాట అలలం, కలలం
కడుపు నిండిన వానికి, మండిన వానికి పోరు
అహంకారానికి, ఆత్మ గౌరవానికి పోరు
సంకుచితానికి, విశాల భావానికి పోరు
హరించిన ప్రజా ధనానికి,
తెగించిన ప్రజా బలానికి పోరు
మహోన్నత సామ్యవాదానికై
ఘర్షణాత్మక వాతావరణం కొత్త కాదు మాకు
నిలదీసే కాలం ఇది
నియంతలకి కాలం చెల్లింది
కోటం చంద్రశేఖర్: 94920 43348