సిందూర రేఖ రక్తసాక్షిగా వెలిగింది,
ధీరుల నడకకు భూదేవి పులకించింది.
సరిహద్దు గాలి పటాకుల్లా మోగింది.
అమ్మ కడుపు కన్నీటి తడిగా మారినా…
ఆ వీరుని నడక ఒక్క అడుగు తగ్గలేదు.
తండ్రి ఆశల పూదోట ముసురు పడినా..
తల్లి తొలి ముద్దు త్యాగమై నిలిచే… జై హిందని.
నల్ల చీకటిలో దీపాలై వెలిగిన వీరులు,
వారి నీడలో ఓ వెలుగు చూసింది దేశం.
జీవితాన్ని పణంగా పెట్టి నిలిచి ధైర్యం,
ఆ ధైర్యంలో జాతీయ గీతమై పులకించింది దేశం.
ఒక్క జెండా కోసం శ్వాసను ధర్మంగా చేశారు,
వారిని చూసి గగనమే గర్వంతో వంగింది.
కన్నీటి వెనుక జ్వాలగా రగిలిన ఆ శక్తి,
పరాక్రమమై మన దేశానికి కవచంలా నిలిచింది.
చలికి చెమట,
మృతికి ఎదురుగా చిరునవ్వు,
అన్నీ వదిలి, దేశ జెండాను పట్టిన త్యాగధనులు,
పోరాడినది ఓ సరిహద్దు కోసం కాదు,
దేశ భవిష్యత్తు కోసం.
సిందూరమై మురిసిన భువిపై,
ఒక్కో క్షణం ధైర్యానికే సాక్ష్యం.
వీరుల రక్తంతో రాసిన చరిత్రలా..
ప్రతి గుండెలో సజీవమై ఉండే..
ఆపరేషన్ సిందూరానికి.. వీర వందనం.
– ననుబోలు రాజశేఖర్ 9885739808