పువ్వులతో పువ్వులకు పండుగ
వ్యవసాయ పొలంలో శ్రమించి పొద్దుమూకిన యాళ్ల ఇంటికి నడిచి వచ్చేదారిలో మిలమిలమెరిసే బంగారు వన్నెల తంగేడు పువ్వులను, అడవి నిండా పరిమళాలను నింపే వెన్నెల వర్ణంపు కొడిసె పువ్వులను, పొన్న పువ్వులను పిడికెడు తెంపుకొని సిగనిండా పెట్టుకోవడంలో పొద్దంతా శ్రమించిన అలసటను మర్చిపోవడం తెలియజేస్తుంది.
ఈ భూ మండలాన్ని ఆసాంతం ఆవహించిన అనేక రంగుల పువ్వుల సింగిడీల పరిమళాలు ఓజోను పొరగా రూపాంతరం చెందాయి. సున్నితత్వం, విలువలు, సౌందర్యం, మానవ గౌరవం, ఈ పరిమళ రక్షణలో ఇప్పటికీ కొంతైనా నిలకడగా ఉన్నాయంటే కారణం, ప్రాణవాయువును పంచే అనేక పువ్వులు దునియల విస్తరించి ఉండట మే.’ పువ్వులను గురించి ఇంకొంచెం వివరంగాచూస్తే … పవిత్రమైన భావనకు ప్రతీకలైన దేవుళ్లు దేవతలు, కల్లాకపటం లేని పసిపిల్లలు, గొప్ప దార్శనికులైన వ్యక్తుల జీవితాలు పువ్వులతో పెనవేసుకొని ఉండటం చూస్తాం.
వ్యవసాయ పొలంలో శ్రమించి పొద్దుమూకిన యాళ్ల ఇంటికి నడిచి వచ్చేదారిలో మిలమిలమెరిసే బంగారు వన్నెల తంగేడు పువ్వులను, అడవి నిండా పరిమళాలను నింపే వెన్నెల వర్ణంపు కొడిసె పువ్వులను, పొన్న పువ్వులను పిడికెడు తెంపుకొని సిగనిండా పెట్టుకోవడంలో పొద్దంతా శ్రమించిన అలసటను మర్చిపోవడం తెలియజేస్తుంది. ఆ రకంగా మానవ సమాజానికి వెలకట్టలేనంత తోడ్పాటునిస్తు న్న పువ్వులకు (పూల ప్రపంచానికి) కృతజ్ఞతను అందజేసుకునే ప్రక్రియలను పండుగ సంబురాలుగా (ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్) జరుపుకొనే ఆనవాయితీకి అనాదినుంచి తెలంగాణ పుట్టినిల్లయింది.
మరోవైపు మానవత్వం మీద, సంస్కృతి మీద, మానవ ఉత్పత్తి నైపుణ్యాల మీద దాడులు జరుగుతున్నట్టే భూమిపై, పచ్చదనంపై, వనరులపై కనపడేవి, కనపడనివి దాడులు జరుగుతున్నాయి. పచ్చదనానికి ఆలంబనగా నిలువాల్సిన మానవసమాజం ప్రకృతిపై ఆధిపత్యానికై అర్రులు చాస్తున్న నేపథ్యంలో పువ్వుల బతుకమ్మ స్థానం, ప్రస్థానం ఆధునికంలో మరింత ప్రాధ్యాన్యాన్ని సంతరించుకుంటుంది. అంతేకాక పస్కపచ్చదనం, ప్రకృతి పరిరక్షణను బతుకమ్మగా నిర్వచించబడుతూ అత్యంత ఘనమైన పువ్వుల వేడుకలై తెలంగాణ రాష్ట్రపండుగగా బతుకమ్మ పువ్వుల సంబురాలు విరాజిల్లుతున్నయి. ఈ నేపథ్యంలో, పువ్వులను గురించిన శాస్ర్తాలు, సాహిత్యం, సంప్రదాయాలు, సంబురాలు, వేడుకలు విరివిగా చర్చకొచ్చినవి, వస్తున్నయి. వీటన్నింటిని ఇనుమడింపజేసి, మరింత మెరుగులు దిద్దే వ్యవసాయ ఉత్పత్తులు, వాటిచుట్టూ ఆసరాగా నిలబడే వాతావరణం, ప్రకృతి, రుతువులు, కాలాలు, పండుగలు, ఈ కోవలోనే బతుకమ్మ పర్యావరణం రక్షణ అనే భావన బలపడటానికి తోడ్పడుతాయి. ఈ నేపథ్యంలో పై అంశాలన్నింటిని గొలుసుకట్టుగా మోసుకొచ్చేది మన బతుకమ్మ.
కొత్తనీరు, కొత్తగాలి, కొత్తమొలకలకు, తీగెలకు పూచినపువ్వులతో పేర్చే పండుగ ఈ పువ్వుల బతుకమ్మ. ఇది పరిపూర్ణమైన ప్రకృతి పువ్వుల పండుగ. బతుకమ్మను గురించి ఇలా పేర్చుకుంటూ, చెప్పుకుంటూపొతే ఎన్నో ప్రత్యేకతల చరిత్రసుట్లని, ప్రకృతిసంప్రదాయ తంతెలని కలిగి ఉండటం ఈ పండుగ ప్రత్యేకత. అయితే, ఈ కోవకు చెందిన పువ్వుల పండుగలను ప్రాచీనత కలిగిన ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లోనూ జరుపుకోవడం చూస్తాం. మన బతుకమ్మతో సహా అన్ని దేశాల్లో పువ్వుల పండుగల్లో సారూప్యత కనిపిస్తుంది. ఇది ప్రకృతి ఆధారిత పూల పండుగ.
బతుకమ్మలో అతి ముఖ్యమైన అంశం ఏమంటే స్త్రీలు పువ్వులతో పువ్వులను పూజించే అతి ప్రాచీనమైన ప్రకృతి పండుగ బతుకమ్మ అనీ. కనుక ఈ పండుగ ఒక కులానికో మతానికో, ఒక దేవుడికో, ఒక దేవతకో సంపన్నవర్గాలకో పరిమితం కాకుండా అందరినీ కలుపుకపోయే పండుగ. అంతేకాక ప్రకృతి మూలసూత్రాల పునాదిగా బతుకమ్మ జరుపుకొంటారని పర్యావరణవేత్తలు వెల్లడిస్తున్నారు.
డాక్టర్ గోగు శ్యామల
(అక్షరయాన్ సౌజన్యంతో..)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

