దుష్ట శిక్షణ
బడికి పోవాలనే ఆశ ఉండే, సదువుమీదనే ధ్యాస ఉండే, గాశారం మంచిగ లేక సదువు మానేశిన, నిన్ను మాత్రం నా తీరుగా కానియ్య బిడ్డ,
బడికి పోవాలనే ఆశ ఉండే,
సదువుమీదనే ధ్యాస ఉండే,
గాశారం మంచిగ లేక సదువు మానేశిన,
నిన్ను మాత్రం నా తీరుగా కానియ్య బిడ్డ,
నమ్ముకున్న పెనిమిటి నడిబజార్ల ఇడిశిపాయే,
బతుకాగమై దరిదొరకని నదిని ఈదవడ్తిమి,
రందివడకు బిడ్డా నీ తోడుగ నేనున్నా….
నా రెక్కల కష్టంతో నిన్ను సదివిపిస్తా,
నా హిమ్మతితో, నీ ఉన్నతికై పరితపిస్తా,
కలతవడకు బిడ్డా నీ అండగ నేనున్నా….
నడుస్తున్న బాటలో పల్లేరు ముళ్లున్నై,
రాళ్ళూ, రప్పలతో దారంతా నిండి ఉన్నది…
నీ పాదాలకింద నా చేతినుంచి నిన్ను నడిపిస్తా…
గుబులు వడకు బిడ్డా నీ ఎంబటి నేనున్నా
చేరాల్సిన దూరం కానొస్తలేదు,
బతుకుపోరు ఎందాకో సమజైతలేదు…
చింతవడకు బిడ్డా నీ చెంతనె నేనున్నా….
నువ్వు ఎదిగే క్రమంలో….
గుంటనక్కలు ఈలలేస్తూ ఎంటవడతై,
చిత్తకార్తె కుక్కలు చొంగ కార్చుతూ అదనుకై వేచి చూస్తై….
ఇగో ఎదురు తిరిగే స్ఫూర్తిని నూరి పోస్తున్నా,
ధైర్యమనే రాయిని నీ చేతికిస్తున్నా…
కాలం నీవైపు మొగ్గు చూపేదాంక
నిరీక్షించు….రక్షక భటురాలివై….
మగువలను భక్షించగ చూసిన
దుష్టులను శిక్షించు…
– ఎన్.లహరి
98855 35506
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- dialect
- Girl
- NT Kavitalu
- poem
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

