క్రమ్మెన్ మానసమందు సత్త ప్రణవాకారంబు సద్వ్యాప్తమై
చిమ్మెన్ నీదు దయామృతంబు కృపనున్ శ్రీధాత్రి నిన్ మ్రొక్కెదన్
నమ్మంబల్కెద నీదు ప్రాభవములన్ నల్దిక్కులన్ మ్రోగగా
అమ్మా నా తెలగాణ నీదు పదమున్నర్చింతు పద్యాకృతిన్
తెలగాణమ్మిది సంస్కృతీ విలస దాత్మీయానురాగంబుధిన్
జలజాతమ్ముల వోలె సజ్జన వరుల్ సత్కాములైయుండఁగన్
చెలిమల్ మించుచు నక్షయంబుగ గనుల్ శ్రేయోనిధుల్ స్వర్ణముల్
వెలయున్ నిత్యము శాంతి సౌఖ్యములు సంపీతిన్ ప్రసాదించుచున్
శాతవాహన సంప్ర దాయపు సౌరభమ్ములు ంచుచున్
జాతి వెల్గులు కాకతీయుల సత్యపాలన రూపమై
హృద్విశాలుడు చంద్రశేఖరుడుద్యమించుచు సాగగా
నిత్య వైభవ నేత్ర పర్వపు నేర్పు మా తెలగాణదే
విద్వత్తు నిరతమ్ము వెలుగులన్ చిమ్మగా-ఉత్పత్తి సంస్థలే ఉద్యమించె
చెరువులు కాల్వలున్ చెన్నొంది పారగా- తెలగాణ జలనిధుల్ దీప్తినింపె
ప్రగతి కేంద్రములయ్యె పల్లెలు పట్నాలు-బహు యోజనలతోడ పరిడవిల్లి
సకలరంగములందు సామర్థ్యములు పెంచి – సందీప్తమయ్యెనా చంద్రకామ్తి
స్వర్ణ తెలగాణ సాధించె స్వాప్నికుడు-నవ భగీరథుడైనీటి నంద జేసే
నీరు నిధులు నియామక నియతి తోడ-సాగుచుండెను పాలన సక్రమమున.
శ్రీకరమ్మును సుస్థిరమ్మున శ్రీ పథమ్మున సాగుచున్
చీకటంతయు పారద్రోలుచు శీఘ్రమే తెలగాణయున్
ప్రాకటమ్మున విశ్వమందున భాగ్య రాష్ట్రము చేయగన్
చాకచక్యము తోడ నేర్పున చంద్రశేఖర సాగుమా
– డాక్టర్ ఎన్.వి.ఎన్ చారి, 98666 10429