కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను పరిశీలిస్తే, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవడమే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తున్నది. అధికారంలోకి రావడమే టార్గెట్‌గా, ఆ పార్టీ అమలు కానీ హామీలు ఇస్తున్నట్టు అర్థమవుతున్నది. మ్యానిఫెస్టోలో ఇష్టానుసారంగా హామీలు పొందుపర్చిన హస్తం నేతలు, అసలు వాటిని ఎలా నెరవేరుస్తారో చెప్పలేదు. రాష్ట్ర బడ్జెట్, హామీల అమలుకు అయ్యే ఖర్చుపై స్పష్టత ఇవ్వలేదు. మ్యానిఫెస్టోను బట్టి ఆ పార్టీ అనుకోకుండా అధికారంలోకి వస్తే రాష్ట్రం ‘కుక్కలు చింపిన విస్తరే’ అన్నట్టు తయారయ్యే ప్రమాదమున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014-15 ఆర్థిక సంవత్సరానికి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. లక్ష కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2023-24 లో సుమారు రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ లెక్కన వచ్చే ఏడాది రూ. 3.10 లక్షల కోట్ల నుం చి రూ. 3.20 లక్షల కోట్లకు బడ్జెట్ చేరుకునే అవకాశమున్నది. ఈ బడ్జెట్‌తో మ్యానిఫెస్టోలో ఇచ్చి న హామీలను ఎలా అమలు చేయగలదో కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేదు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీనికి కనీసం రూ. 25వేల కోట్లు అవసరమవుతాయి. రైతులకు , కౌలు రైతులకు రూ. 15వేల రైతు భరోసా, భూమి లేని రైతులకూ రూ. 12వేలు ఇస్తామని చెప్తున్నది. అంటే ఏ టా 30-35 వేల కోట్లు ఈ ఒక్క పథకానికే అవసరమవుతాయి. మరోవైపు రైతుబీమాను అమలు చేస్తే రూ. 1500 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు ఏటా రూ. 15వేల కోట్లు , వరికి రూ. 500 బోనస్‌కు రూ. 15వేల కోట్లు అవసరమవుతాయి. వీటికే సుమారు రూ. లక్ష కోట్లు అవసరమవుతాయి.
6 గ్యారెంటీలలో భాగంగా ప్రకటించిన ‘మహాలక్ష్మీ’ని అమలు చేయాలం టే కనీసం రూ. 30వేల కోట్లు అవసరమవుతాయి. కుటుం బ పెద్ద అయిన ప్రతి మహిళ కు రూ. 2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ స్కీంకు ఏడాదికి రూ. 27వేల కోట్లు, రూ. 500కే గ్యాస్ ఇస్తే, ఈ సబ్సిడీని భరించాలంటే రూ. 400 కోట్ల భారం పడుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి రూ. 3వేల కోట్లు అవుతాయి. చేయూత పింఛన్లకు ఏడాదికి రూ. 24వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. వీటికి తోడు 200 యూనిట్లలోపు గృహలకు ఉచిత విద్యుత్‌కు రూ. 5వేల కోట్లు, నిరుద్యోగ భృతికి రూ. 2వేల కోట్లు, వధువుకు రూ. లక్ష సాయంతోపాటు తులం బం గారానికి రూ. 4వేల కోట్లు, అమరుల కుటుంబాలకు రూ. 25వేల పింఛన్, అంబేద్కర్ అభయహస్తం, ఉచిత స్కూటీ లు, రూ. 10 లక్షల వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత సన్నబియ్యం, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12వేలు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, యువ వికాసంతోపాటు మరో వందకు పైగా హామీలను మ్యానిఫెస్టో లో చేర్చింది. వీటిని అమలు చేయాలంటే రూ. 6 లక్షల కోట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం మన రాష్ట్ర బడ్జెట్ రూ. 3లక్షల కోట్లు మాత్రమే.
ఈ నిధులతో ఇచ్చిన హామీ లు అమలు చేయడం అసాధ్యమని కాంగ్రెస్ అగ్రనేతలకూ తెలుసు. కేవలం ప్రజలను మ భ్యపెట్టి ఓట్లు రాబట్టుకోవడానికి తప్ప అమలు చేయడానికి మా త్రం కాదని తెలుస్తున్నది. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే కర్ణాటక పరిస్థితి తప్పదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
-దుండ్ర కుమారస్వామి
99599 12341