విషయం: సెబీకి మూడు ప్రశ్నలు
అదానీ గ్రూప్‌కు సంబంధించిన విషయాలను హిండెన్‌బర్గ్ బహిర్గతం చేసినందున 94 ఏండ్ల జార్జ్ సోరోస్‌ను విమర్శించేందుకు, విదేశీ హస్తం ఉందని నిందించేందుకు బీజేపీని అనుమతించడం ద్వారా భారతదేశ గౌరవనీయ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ వెర్రివెంగళప్పలా మారుతున్నది. ఇది హాస్యాస్పదమని మీకూ తెలుసు. నాకూ తెలుసు. తర్వాత వారు టేలర్ స్విఫ్ట్పైనే ఆరోపణలు చేస్తారు. అనుమానపు వేలు ఇప్పుడు వారి అగ్రనాయకత్వం వైపే చూపెడుతున్నది. అందుకే బీజేపీ ఇప్పుడు ఆందోళనలో పడింది. రామ్‌దేవ్ బాబా ధ్యానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, విశ్రాంతి తీసుకోవాలని ఆందోళనలో ఉన్న బీజేపీకి మీరు చెప్పండి. మీలో కొందరు నిపుణులు, బ్యూరోక్రాట్లు ఉన్నారు. మీ ప్రతిష్ఠను దెబ్బతిసేందుకు బీజేపీని ఎందుకు అనుమతిస్తున్నారు? అబద్ధాల్లో ఆరితేరిన, బురదజల్లడంలో ప్రావీణ్యం సాధించిన పార్టీ వారిది. ప్రజలకు నిజానిజాలను చెప్పడం మీ కర్తవ్యం.
1. హిండెన్‌బర్గ్‌ను కాసేపు పూర్తిగా పక్కనపెట్టండి. 2014(ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పుడు)లో 4.5 బిలియన్ డాలర్లున్న అదానీ నెట్‌వర్త్.. 2020లో 11 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత 2021 నాటికీ అనూహ్యంగా 76 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2022లో 150 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. ఇదంతా వ్యాపారమేనని మీరు అనుకుంటున్నారా? షేర్ ధరల అవకతవకలను సుమోటోగా తీసుకొని మీరు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? అదానీ గ్రూప్ క్యాపిటలైజేషన్ అబ్బురపరిచే వృద్ధిపై మీరు వివరణ ఇవ్వాలి. ప్రత్యేకించి, మోదీ ప్రభుత్వంతో ఉన్న సంబంధం గురించి.
2. 2022లో కేవలం 7 అదానీ గ్రూప్ కంపెనీలు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో 80 శాతం వాటాను కలిగి ఉండటం ఆశ్చర్యకరం. ఇదంతా చూస్తే కామర్స్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థి ‘అరె! అసలు ఏం జరుగుతున్నది?’ అని కనుబొమ్మలు ఎగురవేస్తాడు. కానీ, షేర్ ధర పెరుగుదలలో వారి పాత్రపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని సెబీ అనుకోలేదు. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు కదా! అసలు దీన్ని ఎవరైనా నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? షేరు విలువ/ ఆర్జన నిష్పత్తి గురించి పరిశీలించాలని మీకు అనిపించలేదా? మీరు ఏం విస్మరించారో లేదా కావాలని నిర్లక్ష్యం చేశారో చూద్దాం. (అదానీ పవర్ పీఈ 769 వద్ద ఉన్నప్పుడు టాటా పవర్ 34 వద్ద ట్రేడవుతున్నది. అదానీ గ్యాస్ 747 వద్ద ఉండగా.. దాని ప్రత్యర్థి కంపెనీ ఇంద్రప్రస్థ గ్యాస్ 17 వద్దే ఉంది. దయచేసి వారి వార్షిక నివేదికలను చదవండి. ఎలాంటి ఆర్థిక పరిమితులు దీన్ని సమర్థించవు).
కఠినమైన వాస్తవం ఏమిటంటే.. మార్కెట్లతో ఆటలాడుతున్నప్పుడు మీరు మీ బాధ్యతలను విస్మరించి నిద్రమత్తులో జోగుతున్నారు. కేవైసీలు, డిజిటల్ చెల్లింపులు, నగదు బదలాయింపులకు సంబంధించిన శాశ్వత డిజిటల్ సాక్ష్యాధారాలను నమోదు చేస్తున్న యుగంలో మనం ఉన్నాం. హిండెన్‌బర్గ్ అనుమానాలను లేవనెత్తింది. కానీ, ఏడాది పాటు దర్యాప్తు చేసిన తర్వాత కూడా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని సెబీ తేల్చిచెప్పింది. ఇదెలా ఉందంటే.. ఒలింపిక్స్‌కు ప్యారిస్ ఆతిథ్యమిచ్చినట్టు రుజువులు చూపమని అడిగినట్టుగా ఉంది.
3. అదానీ షేర్లలో విదేశీ ట్యాక్స్ హావెన్స్కు సంబంధించి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తు పూర్తయితే పెద్ద తలకాయలు బయటపడతాయి కనుక దర్యాప్తును నిదానంగా, సులభంగా బయటపడేలా లేదా మొత్తంగా దర్యాప్తును ధ్వంసం చేయాలని మీపై ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా పీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందా? మీరేమైనా కీలుబొమ్మలా? అదే కనుక నిజమైతే మీరు నోరు విప్పాలి. పైన పేర్కొన్న వాటికి మీ పారదర్శక ప్రతిస్పందన ‘సన్‌లైట్'(ఒకప్పటి ఫేమస్ డిజర్జెంట్ సబ్బు)లా సాయపడుతుంది. అంటే దానర్థం.. సూర్యకాంతి అన్నింటినీ పరిశుద్ధం చేస్తుంది కదా!