అయ్యో
నా చితికి ఇంత ఖర్చా!
డబ్బాల డబ్బాల ఇంధనం
బండెడు కట్టెలు!
డప్పుల బలగం!
ఇంకా వాహనమా!
పూల దండలా!
భగవద్గీత శ్లోకాలా!
శవానికి అలంకరణ వ్యర్థం
దుబారాతనం??
ఇంతింత ఖర్చా!
నేను దాచుకున్న నోట్లు
నీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నారు!
వీళ్లకు డబ్బు విలువ తెలియదు
చచ్చిన నాకు ఇంత ఖర్చా?
వల్లకాటిలో లోతుగా గొయ్యి తవ్వి
నన్ను పాతివేస్తే పోలా!
సింపుల్!!