సమైక్యతే మన నినాదం
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 ను వేదికగా చేసుకొని ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే దిశగా వితండ వాదనలు చేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల భావోద్వేగాలను అయోమయంలోకి నెట్టుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న కాంక్షతో ఈ వివాదాన్ని మతతత్వ మంటలతో రెచ్చగొట్టి తను చలి కాచుకోవాలనుకుంటున్నది. బీజేపీ నాయకులు హైదరాబాద్ పెరేడ్‌గ్రౌండ్
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 17 ను వేదికగా చేసుకొని ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునే దిశగా వితండ వాదనలు చేస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల భావోద్వేగాలను అయోమయంలోకి నెట్టుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న కాంక్షతో ఈ వివాదాన్ని మతతత్వ మంటలతో రెచ్చగొట్టి తను చలి కాచుకోవాలనుకుంటున్నది. బీజేపీ నాయకులు హైదరాబాద్ పెరేడ్‌గ్రౌండ్ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆహ్వానించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై విమోచనోత్సవాలను స్వయంగా నిర్వహిస్తానని ప్రకటించడం హాస్యాస్పదం.
ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలుగా నిర్వహిస్తున్నది. గవర్నర్ మాత్రం విమోచన దినోత్సవం నిర్వహిస్తాననడం విడ్డూరం. దీని అర్థం ఏమిటి? గవర్నర్ తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఊరంతా ఒక దారైతే ఉలిపికట్టది మరొకదారి అన్నట్లు బీజేపీ మాత్రం మతం, కులం, ముసుగులో రాజకీయం కోసం విమోచన పేరుతో విచ్ఛిన్నకర కుట్రలకు తెరలేపింది. అసలు సెప్టెంబర్ 17న చరిత్రలో ఏం జరిగింది? దాని ప్రాధాన్యత ఏమిటి? ఎందుకంత వివాదాస్పదమవుతున్నది?
భారత స్వాతంత్రానికి పూర్వమే హైదరాబాదు ఒక స్వతంత్ర రాజ్యంగా ఉండేది. బ్రిటీష్ రాణి కి అనుబంధంగా హైదరాబాదు తో సహా చాలా సంస్థానాలు ఆనాడు ఉండేవి. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే క్రమంలో ఈ సంస్థానాలకు చివరి బ్రిటీష్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ ఒక వెసులుబాటు ఇచ్చారు. దాని ప్రకారం హైదరాబాదు లాంటి రాజ్యాలు బ్రిటీష్ పాలనలో లేవు కనుక అవి స్వతంత్రంగా ఉండడమా, భారతదేశంలో లేదా పాకిస్తాన్ లో కలవడమా అనేది వారి ఇష్టం అని ప్రకటించారు. అయితే నాటి నిజాం స్వతంత్రంగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. అలా 1947 నుండి 1948 సెప్టెంబర్ 17 దాకా హైదరాబాదు ప్రత్యేక రాజ్యంగా ఉన్నది. ఈ క్రమంలోనే నిజాం రాజు పరిపాలనలో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పటేల్ పట్వారీ భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా, రజాకారులపై కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కొనసాగించినారు. దాన్ని అణచడం కోసం నాటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో 1948 సెప్టెంబర్ లో హైదరాబాద్‌పై సైనికచర్యకు దిగారు. దీంతో నిజాం రాజు సెప్టెంబర్ 17న లొంగిపోయి హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చరిత్ర పరిణామ క్రమాన్ని గ్రంథస్తం చేసిన అనేక రచనలు ఎక్కడా విమోచనం అనే పదాన్ని ఉపయోగించలేదు. కానీ నేటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం విమోచన అని ప్రకటించడం దుస్సాహసమైనది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని జునాగఢ్ సంస్థానం కూడా ఆనాడు భారత్‌లో విలీనమైంది. కానీ నేడు అక్కడ ఎలాంటి విమోచన ఉత్సవాలను కేంద్రం, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం నిర్వహించడం లేదు. కానీ అదే బీజేపీ తెలంగాణలో మాత్రం విమోచన దినమని హడావిడి చేయడం దుర్మార్గం.
ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చిన సెప్టెంబర్ 17 నిజంగా జాతీయ సమైక్యతా దినం. అందుకే సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ వజ్రోత్సవాలు నాటి చారిత్ర క సందర్భాన్ని స్ఫురణకు తెస్తున్నది. అందుకే ఈ సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలు కుల మత జాతి వైరుధ్యాలు లేకుండా తమ సఖ్యతను ప్రదర్శించి ఈ సమైక్యత ఉత్సవాలలో విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుందాం.
– డా.కే.వాసుదేవ రెడ్డి
95530 86666
(వ్యాసకర్త: రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

