కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల జాబితాను పార్టీ రాష్ట్ర ఇంచార్జి మానిక్‌రావు థాక్రే తన ప్రెస్మీట్లో వెల్లడించారు. ఆ జాబితాలో పేరు లేనివారంతా తాజాగా ఓ గ్రూపు కట్టినట్టు తెలిసింది. థాక్రే కొందరికి అమ్ముడుపోయి సీఎం అభ్యర్థులుగా వారినే ప్రమోట్ చేస్తున్నారని వారు మండిపడుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని వారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వద్ద ప్రస్తావిస్తే, ఆయన చదివిన సీఎం జాబితాలో తన పేరు చివరలో ఉంది. మరి నేనెవరికి చెప్పుకోవాలని ఆయన ఎదురు ప్రశ్నించినట్టు ఔత్సాహిక సీఎం అభ్యర్థి ఒకరు వాపోయారు.