అతడు
స్వప్నించడమే కాదు
విజయానంద స్వప్న సౌధాల
అభినవ రూపశిల్పి
తడారిన తెలంగాణ తల్లిని
స్ఫటిక జలాలతో అభిషేకించిన
అపర భగీరథుడు
కరెంట్ స్తంభాలకు వేలాడుతున్న
అన్నదాతల బతుకు
బట్టలు కరెంట్ తీగల మీద
తగలబడి పోతుంటే
కరెంట్‌ను పర్మినెంట్ వరంగా మార్చి
ఆరిపోని ఆశాదీపాలను వెలిగించిన
ఆత్మజ్యోతి
కరెంటు ట్రాన్స్ఫార్మర్
మందుగోళీలకే కాదు
ముది వయసు జిహ్వాచాపల్యాన్ని తీర్చే
తెలంగాణ అవ్వ ఆకుల సంచి
జననం నుంచి పునర్జన్మ వరకు
చెయ్యి పట్టి నడిపిన మేనమామల
కల్యాణలక్ష్మి కిట్టు
నెర్రెలు వారిన నేలలో చలిచెలిమ
శిశిరమైన జీవితాలకు నవవసంతం
వెలసిపోయిన వార్ధక్యపు మేడల్లో
కొత్త కాంతులు నింపిన
తెలంగాణ సింగిడి
అయోమయపు అన్నదాతల జీవితాలకు ధీమానిచ్చిన రైతుబీమా
వర్గాంతరాలకు సవాలుగా నిలిచిన
దళిత బంధు
తెలంగాణ భవిష్యద్దర్శనం చేసుకున్న ద్రష్ట
ఎవ్వరికీ, ఎప్పుడూ తలవంచని
తెలంగాణ ఆత్మగౌరవం
అతడే
సమస్త తెలంగాణ జనుల
హృదయ స్పందన