అవును, కాంగ్రెస్ అంటేనే విధ్వంస ం, కాంగ్రెస్ అంటే వినాశనం. కాంగ్రెస్ అంటేనే దాడులు, దమనకాండ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇదే కథ. ఆరు దశాబ్దాల హస్తం పార్టీ పాలనను పరికించి చూస్తే ఈ విషయం అర్థమ వుతుంది. నాటి ఎమర్జెన్సీ ఇందిరమ్మ రా జ్యం నుంచి నేటి నయా ఇందిరమ్మ రాజ్యం వరకు కాంగ్రెస్ పాలనలో రాజ్యం చేస్తున్న దాడులకు విద్యార్థులు, పేదలు, బడుగులు బలవుతూనే ఉన్నారు. చెప్పినట్టుగానే సీఎం రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులను తొక్కేసుకుంటూ వచ్చి సీఎం సీటును ఆక్రమించుకున్నాడు. ‘ముందొచ్చిన చెవులకన్నా, వెనుకొచ్చి న కొమ్ములు వాడి’ అన్నట్టు… అధిష్ఠానం కూడా ‘ఇక మాకు రేవంతే దిక్కు’ అనడంతో ఆయన ఆగడాలకు అడ్డే లేకుండాపోయింది. కాం గ్రెస్ కోరలను రేవంత్ తగిలించుకున్నాక రాజ్యం చేసే అకృత్యాలు శ్రుతిమించిపోయా యి. కార్చిచ్చుకు వాయువు తోడైనట్టు.. వినాశకారి కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి తోడయ్యాడు. అందుకే ఇన్ని తతంగాలు.
సీఎం రేవంత్ నియోజకవర్గమైన లగచర్ల దమనకాండను మర్చిపోకముందే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి పచ్చని అడవుల్లోకి బుల్డోజర్లను ఉసిగొల్పాడు. అవి సృష్టించిన విధ్వంసకాండతో ఆ అడవిలోని ఉన్న మూగజీవాలు కొన్ని మరణించగా మరికొన్ని ఆర్తనాదాలు పెడుతూ జనావాసాల్లోకి చేరుకున్నాయి. వర్సిటీ భూములను కాపాడుకునేందుకు విద్యార్థులు నిరసనలకు దిగితే వారిని గుంట నక్కలతో పోల్చడం మన సీఎం రేవంత్‌కే చెల్లింది. అంతేకాదు, నిరసిస్తున్న విద్యార్థుల వీపులపై లాఠీలు విరగకొడుతూ, మహిళా విద్యార్థులనే కనీస సోయి లేకుండా జుట్లు పడుతూ పోలీసులు ఈడ్చుకెళ్లడం హేయనీయం.
పేదలు, వర్సిటీ భూములపై స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రేవంత్ కన్ను పడుతుందనే విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే లగచర్ల భూములపై కన్నేసిన రేవంత్ వాటిని అప్పనంగా కాజేయాలని కుటిలయత్నం చేశాడు. రాబందులా తన్నుకుపోవాలని చూశాడు. అల్లుడికి అయాచిత లబ్ధి చేకూర్చేందుకు, మన బిడ్డ అని నమ్మి ఓట్లు వేసి, అందలమెక్కించిన సొంత నియోజకవర్గం ప్రజలపైనే దాడులకు దిగారు. తన సోదరుడికి లేని పెత్తనం అప్పజెప్పి దౌర్జన్యానికి దారులు తెరిచారు. నోటి కాడి బుక్క లాక్కుంటుండటంతో చేసేదేమీ లేక తిరగబడ్డ రైతులపై కక్షగట్టి రాజ్యాన్ని ఉసిగొల్పారు. పోలీసులు, రౌడీమూకలను అర్ధరాత్రి రైతుల ఇండ్లపైకి పంపి దుశ్శాసన పర్వానికి రేవంత్‌రెడ్డి తెరతీశాడు.
ఆడా, మగ తేడా లేకుండా అందరిపై లాఠీలు విరగ్గొట్టారు. దొరికిన వాళ్లను దొరికినట్టు చెరసాలలో బంధించి రాక్షసానందం పొం దాడు. రైతన్నలు తిరుగుబాటు చేస్తున్నా లెక్కచేయక మూర్ఖంగా ముందుకుపోయిన రేవంత్ ప్రభుత్వం మరో దారిలో భూములను కబళించాలని చూసింది. ఫార్మా క్లస్టర్‌కు బదులు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మసిపూసి మారేడుగాయ చేయాలని ప్రయత్నించింది. ఏ రా యి అయితే ఏమిటి పండ్లు రాలగొట్టుకోవడానికి అని గ్రహించిన అన్నదాతలు.. ఫార్మా క్లస్టర్ అయినా, ఇండస్ట్రియల్ కారిడార్ అయినా భూములు ఇచ్చేదే లేదని తెగేసి చెప్పారు. రాజ్యంపై పోరును ఉధృతం చేశారు. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది.
నేడు హెచ్‌సీయూ ఘటనలోనూ రేవంత్ ప్రభుత్వానికి అదే సీన్ రిపీటైంది. వర్సిటీ భూములను భూ బకాసురులు కబళిస్తున్నారనే విషయం తెలుసుకున్న విద్యార్థులు పొద్దనకా, పగలనకా పోరాటాలు చేశారు, నిరసనలు తెలిపారు. ఈ ఉద్యమాలు ఉధృతం కావడంతో వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. హెచ్‌సీయూ భూముల వేలాన్ని ఆపమంటూ హైకోర్టు స్టే ఇవ్వడమే కాదు, ఏకంగా సుప్రీం కోర్టు కూడా రేవంత్ ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది.
లగచర్ల ఘటనలో నాడు భూమిపుత్రులు, గిరిజన బిడ్డల ఉద్యమం సఫలీకృతమైతే, హెచ్‌సీయూ వివాదంలో విద్యార్థులు విజయం సాధించారు. ‘మా భూములు మాకు కావాలంటూ’ అటు రైతన్నలు ఇటు విద్యార్థులు ఎగురవేసిన తిరుగుబావుటా విజయపతాకమై నింగికెగిసింది. రాజ్యం ‘హస్త’గతమైందని విర్రవీగుతూ, రాచరికాన్ని మిం చి రాక్షసంగా ప్రజలపై దండెత్తిన ఏలికల గర్వమణిగింది. ప్రపంచాని కి అన్నం పెట్టే అన్నదాత, సమాజాన్ని ఉన్నత మార్గంలో నడిపించే విద్యార్థుల ఆర్తనాదాలను ఆలకించిన హైకోర్టు, సుప్రీంకోర్టులు వీరి పక్షాన నిలబడటంతో రేవంత్ ప్రభుత్వానికి లాగి చెంప మీద ఒక్కటిచ్చినట్టయ్యింది.
ఆపదంటే చాలు అక్కున చేర్చుకొని, పేదల పక్షాన నిలిచే బీఆర్ఎస్ పార్టీ నాడు అన్నదాతలకు అండగా నిలిస్తే, నేడు హెచ్‌సీయూ విద్యార్థులకు భరోసా కల్పించింది. వారిపై దెబ్బ పడకుండా అడ్డుగా నిలుచున్నది. రేవంత్ సర్కారును ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది. పోరుగడ్డ తెలంగాణ పోరాట స్ఫూర్తిని మరోసారి చాటింది. లగచర్ల మహిళామణులు చేసిన ఉద్యమం చాకలి ఐలమ్మ పోరాటాన్ని, రాణి రుద్రమదేవి యుద్ధాన్ని యాదికి తెస్తే, హెచ్‌సీయూ విద్యార్థులు చేసిన పోరాటం మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించింది. ఇది అంతం ఏ మాత్రం కాదు, ఆరంభం మాత్రమే. ఇప్పటికే అన్యాయమై, ఆగమై రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న తెలంగాణ సమా జం ఈ విజయ స్ఫూర్తితో రానున్న రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఖాయం. అతి త్వరలో విధ్వంసపు వటవృక్షాన్ని కూకటివేళ్లతో సహా కూల్చడం తథ్యం.
– కాసర్ల నాగేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షులు, ఆస్ట్రేలియా