ఆయన
ఓ శాస్త్రవేత్త
ఓ సాహితీవేత్త
ఆ మేధ అద్భుతాల గని
ఆ చేత ఆవిష్కరణల నిధి
ఓ సృజనశీలి
ఓ ప్రభావశాలీ
ఆ హాసం శాంతి చార
ఆ వీక్షణం క్రాంతి ధార
ఓ నిత్య విద్యార్థి
ఓ సర్వత్ర సత్యార్థి
ఆ పలుకు ప్రణవ నాదం
ఆ ప్రవచనం ప్రమోద గీతం
ఓ మహర్షి
ఓ మహా మనీషి
ఆ అస్తిత్వం అజరామరం
ఆ వ్యక్తిత్వం ఆదర్శప్రాయం
కలలు కనండీ..
సాకారం చేసుకోండని
యువతను ప్రేరేపించిన
నవ యుగ జ్ఞాన సూరీడు
దేశ అణ్వస్త్ర పొదిలో
పొదిగిన మిస్సైల్ మ్యాన్
దేశ అధ్యక్ష పదవికి
వన్నెలద్దిన మిన్నకాడు
తన మోధోసంపత్తి జాతికి
దారబోసిన త్యాగధనుడు
ఆ మహనీయుడే..
భారతరత్న పద్మభూషణ్
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం
అపారజ్ఞాన సంపన్నకు
అఖిల జన జయహారతి
విశ్వంభర వినమ్ర ప్రణతి
కోడిగూటి తిరుపతి: 95739 29493