పల్లవి: తెలుగు రాష్ట్రము ఇది తెలంగాణ రాష్ట్రము
తెలుసుకొంటె దేశంలో ఇదే కదా శ్రేష్ఠము ॥తెలుగు॥
చరణం: చెరువు నీరు నిండగా చేను చెలక పండగా
కాకతీయ పథకము పసిడి పంట పండగా
వృద్ధులకు ఆసరా సేదతీర్చె మెండుగా
కల్యాణలక్ష్మి కూడ నవవధువుకు తోడుగా ॥తెలుగు॥
చరణం: భగీరథ యత్నము దాహార్తి తీర్చుటకే
బంగారు తెలంగాణ ప్రథమ శ్రేణి చేర్చుటకే
కల్వకుంట్ల కన్న కల బంగారు తెలంగాణ
భావితరం బాగుకే బంగారు తెలంగాణ ॥తెలుగు॥
చరణం: ఆరోగ్యలక్ష్మితో ఆనంద జీవితం
చేనేత లక్ష్మితో పల్లెప్రగతి పునీతం
హరితహార పథకంతో తెలంగాణ పులకితం
రైతుబంధు రైతుబీమా రైతులకే అంకితం ॥తెలుగు॥
చరణం: మన ఊరు మన ప్రణాళిక సుఖ జీవన ప్రతీక
అమ్మ ఒడి రుణమాఫీ అభివృద్ధి పతాక
ఏనాటి నుంచో కల్వకుంట్ల కన్న కలలు
ఈనాటికి సాకారం కాళేశ్వర జలకళలు ॥తెలుగు॥
– కుడికాల జనార్దన్ (జనశ్రీ),
97032 75050