చంపడం
మా ఉద్దేశ్యం కాదు
కానీ
ప్రతీకారం తీర్చుకోవడం మా కర్తవ్యం.
నుదిటిన
సిందూరం నువ్వు తుడిచేస్తేనేం
వీరుల
రక్తంతో వీరతిలకం దిద్దుతాము.
భారతం
నేర్పలేదా?
స్త్రీ తలచుకుంటే
మరో కురుక్షేత్రమని.
సైనికా
రక్తం చిందిందని బాధపడకు
అదే
భరతమాతకు సిందూరం.
ప్రత్యక్షంగా
పోరాడు
మా వీరుల
ప్రతాపం ఏమిటో తెలుస్తుంది.
ఎంత కాలం
దొంగ దెబ్బ తీస్తావు?
మా ఎదురుదెబ్బ
రుచి చూడు.
ఆయుధం
ఉందని విర్రవీగకు
నీ ఆయుధం
పవిత్ర యుద్ధం చేయలేదు.
వెంట్రుక వాసిలో
ప్రమాదం తప్పిందనా?
తప్పించింది
మేమే.
మీరు
మనుషులు అయితే
మతం పేరిట
మారణకాండ సృష్టించరు.
తల్లికి
బిడ్డలంటే ఎంత ప్రేమో
భరత మాతకు
వీర సైనికులు కూడా అంతే.
వీరులపై
మీ ప్రతాపం క్షమిస్తాం
సామాన్యులపై మీ ప్రతాపం
తల తీస్తాం.
సామాన్యుల
మీదకు గన్లు ఎత్తకు
నీ బుల్లెట్లకు
చింతకాయలు రాలవు.
ఒకసారి హింసిస్తే
సరే
మళ్ళీ మళ్ళీ
తప్పదు తప్పు లేదు ఈ సిందూరం
పవిత్ర యుద్ధం పేరుతో
మోసమా!
అయితే కాచుకో
మా కురుక్షేత్ర యుద్ధం.
దేవుడు ఉన్నాడు అనడం
తప్పా?
మరీ
మీ దేవుడెందుకు మాకు.
– కర్నె మల్లికార్జున్ 63037 44239