భరతదేశమందుభవ్యమౌతెలగాణ
మార్పులెన్ని తెచ్చె మనదు ప్రజకు
విరివిగాను సేవ వివిధ సంక్షేమముల్
అమలుచేసిచూపె అవనిలోన!
వెన్నుచూపు గుణము వెరవని తెలగాణ
ఆత్మ ధైర్య భావ మమలు పరచె
స్ఫూర్తి నించి జనుల చూరగొనె మనస్సు
ఎదురు కొనుట కిలను యెవరు సాటి!?
అమరవీర ప్రాణ అర్పణ త్యాగముల్
దీక్ష లెవరు చేసి దివ్యము గను
కఠిన పోరు లోన కదిలింది జనహోరు
సకల జనుల సమ్మె సఫల మయ్యె!
ప్రభుత వెలసె చూడ పార వశంబేను
కేసిఆరుచాచె కేలు మేలు!
ఉద్యమంబుస్ఫూర్తి వురకలే చూడగ
సుగతి ప్రగతి నెపుడు శుభము లిడును!!
సర్వ ప్రజకు ప్రభుత సకలంబు సమకూర్చె
ఏమిచేయ గలరు యెంచి చూడ
చెప్పడాని కిలను చెరుపు మాటలె సుమా!
జూను రెండు జయము చూడ శుభము!!
ఫలము లన్ని ప్రజకు పంచుతూ పాలన
సాగుతున్న వేళ సాకులన్ని
చెప్పి ప్రభుత కూల్చ చేవింతయునులేదు
చెప్పు మాటలన్ని చేదు వాక్కు!
ఉద్యమంబు వేరు వున్న పాలన వేరు
మోది మాట విన్న ముదము లేదు!
అన్ని రాష్ట్రములలొ నమలు రైతుల బంధు
చేసి చూపువాడె క్షేమమొందు!!
నోటికొచ్చు కూత నెనరును లేకను
పల్కువాళ్ళ కెపుడు పదవి రాదు!
ఎదిగె చూడు ప్రభుత యెనమిదవ వసంత
గీతి పాడ గాను గీలు సుధలు!!
–డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి
85558 99493