పిడికిలెత్తి గొంతెత్తి
ఉద్రేక దేశభక్తి ఉపన్యాసాలకేం తక్కువ లేదు
పేజీలకు పేజీలే!
గంటలు గంటలే!
అందరూ పిల్లల్ని కంటారు
తమ సంతానంలో ఒకరైన సైనికుడిగా
దేశానికి అంకితమైతేనే
అది గొప్ప కుటుంబం
సార్థక వంశం!
భవిష్యత్తులోనైనా మన దేశంలో
ప్రతి కుటుంబం సైనిక కుటుంబమైతే
ప్రపంచానికే మార్గదర్శనం!
శత్రు దేశాలు కన్నెత్తి చూడలేవు
సరిహద్దు గీత దాటి రాలేవు…
– కందాలై రాఘవాచార్య 87905 93638