కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్ఫూర్తితో గద్దర్ తన పార్టీకి గద్దర్ ప్రజా పార్టీ అని నామకరణం చేశారు. పేరుకు గద్దర్ ప్రజా పార్టీ అని ప్రకటించినప్పటికీ ఆ పార్టీకి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి అన్ని పదవులు గద్దర్ తన కుటుంబ సభ్యులకే రిజర్వు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ను కుటుంబపార్టీగా విమర్శించే గద్దర్ అన్ని పోస్టులు తన కుటుంబానికి కట్టబెట్టడం ఏమిటి? అని విమర్శలు వెల్లువెతున్నాయి. గజ్వేల్ నుంచి పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు. అక్కడి నుంచే పోటీ చేస్తారా? అని ఢిల్లీలో మీడియా అడిగితే పార్టీ నిర్ణయిస్తుందన్నారు. అంటే దీని అర్థం నిర్ణయించాల్సింది కుటుంబం అన్నట్టే కదా?