ఏడేండ్ల రాష్ర్టాన ఎన్నియో పథకాలు
అన్ని వర్గాలను ఆదుకొనగ
పల్లె ప్రగతినందు పనులెన్నొ చేర్చిరి
అభివృద్ధి ఫలములనందజేయ
పల్లె ప్రకృతివనం ఉల్లమెంతో హాయి
ఊరికో తీరుగా నొప్పెచూడ
మెట్ట ప్రాంతమున ఇక్కట్టులే తొలగెను
తల్లి గోదావరియే తరలివచ్చే
జలధార నింపెను చక్కగా యలరుచు
చెరువుల కుంటల చేలు మురియ
వ్యవసాయమిపుడు సవ్యమ్ముగా కొనసాగు
మిగిలిన ప్రాజెక్టులగును పూర్తి
సొలసిన రైతులు సుఖములు పొందగా
ధాన్యరాశులు పండు దండిగాను
కులవృత్తులకును చేకూరె వైభవమెంతొ
పథకాలతో వారి పనులు సాగ
నేడు పల్లెలెంతొ వేడుకైనవి చూడ
పచ్చదనముతోడ పరవశించి
ఊరి ప్రజలు కలిసి ఊరినే మార్చిరి
నిధుల కొరత లేదు నిజముగాను
జయము చంద్రశేఖరునకు జయము జయము
ముఖ్యమంత్రిగా వర్ధిల్లి ముందుచూపు వల్ల
సంకల్ప సిద్ధితో వరలు చుండి
నా తెలంగాణ కెంతయో నయము గూర్చె.
జక్కని వేంకటరాజం
94400 21734