e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home ఎడిట్‌ పేజీ న ఘర్‌కా న ఘాట్‌కా

న ఘర్‌కా న ఘాట్‌కా

బొర్రయ్యశెట్టి: ఆయాసాన్ని ఆపుకొని, ఇదేంటి గురువు గారూ ఇలా జరిగింది. మన ఈటల అట్లా బీజేపీలో చేరడం ఏమిటి, దీని పరిణామాలు అతనికి ఎలా సంక్రమించబోతున్నాయి. అంటూ ఇంకా ఆయాసపడుతూనే ఉన్నాడు బరువైన బొజ్జను కదిలిస్తూ..

న ఘర్‌కా న ఘాట్‌కా

జంఘాలశాస్త్రి: మన తెలంగాణలో ఒక మంచి తెలుగు లాంటి ఉర్దూ పలుకుబడి ఉంది. అదేమంటే ‘న ఘర్‌ కా న ఘాట్‌ కా’ అని ఈటల పరిస్థితి ఇదే కాబోతున్నది. నిన్న చాలా మాట్లాడాడు అర్ధ సత్యాలు అసత్యాలు అవి ఇవీ చాలా చాలా, అంతా బక్వాస్‌. ఒకటి చూడు తనది కమ్యూనిస్టు డీఎన్‌ఏ అన్నాడు. అలాంటప్పుడు ఏ పార్టీలో చేరాలి. అయితే తుపాకీ పట్టుకొని మావోయిస్టుల్లో చేరాలి లేదా, అంత ఇది లేకుంటే సీపీఐలోనూ, సీపీఎంలోనూ చేరాలి కదా. ఇవన్నీ కాకుంటే నేడు విపక్షనేత కోదండరాం సూచించినట్లుగా కాంగ్రెస్‌లో చేరాలి, అవ్వ ఇదేంటి మరి తీరా పోయి ఈ పార్టీలకు ఎవరికీ నచ్చని బీజేపీలో చేరుతున్నాడు. శిష్యా నువ్వు కూడా ఆశ్చర్యపోయావా ఆ పార్టీల లాగా.

బీజేపీలో చేరి ఈటల సాధించేదేమిటి. తన అక్రమ సంపాదనలపైన అక్రమ కబ్జాల పైన ఇక్కడ రాష్ట్రంలో కేసులుండి చర్య తీసుకుంటుంటే జాతీయస్థాయిలో ఉన్న బీజేపీ పార్టీ తనకు రక్షణగా వస్తుందని అనుకుంటున్నాడా. అంటే అక్రమ కేసుల్లో ఉన్న నాయకులనందర్నీ, ప్రయాణించే పడవలకే చిల్లులు పెట్టే ప్రబుద్ధులనందరినీ ఆ పార్టీ చేర్చుకొని మునిగిపోయేదే అని అనుకుంటున్నాడా. దానితో ఈయనకు ఒరిగేదేమిటి.?10:45 PM 6/6/2021

బొర్రయ్యశెట్టి: గురువా.. నేను మీలాగే ఆలోచిస్తున్నా.

జంఘాలశాస్త్రి: కన్నతల్లి లాంటి పార్టీకి ఎసరుపెట్టి తాగిన రొమ్ము గుద్దినట్లు ప్రవర్తించి అధినాయకుని మీద ఎదురుతిరిగినప్పుడు నువ్వు వీరుడివి ప్రజాస్వామ్యవాదివి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పుట్టిన అవతార పురుషుడివి అని కీర్తించిన ఈ ప్రతిపక్ష నాయకులకు ఇప్పుడు గొంతు పెగలడం లేదేమిటి. అంటే వారివారి పార్టీల్లో చేరతాడనుకున్న అభ్యుదయ పురుషుడు ఒక ‘మతతత్త్వ’ పార్టీలో చేరిపోయాడని వీరందరూ నోళ్ళు నొక్కుకొని నాలుకలు బయటికి తెస్తున్నారెందుకు. అప్పుడు హీరో అయిన ఈటల ఇప్పుడు స్వార్థపరుడు ఆత్మగౌరవం కోసం కాదు ఆస్తుల రక్షణ కోసం అని స్వరం మారుస్తారా.. ఇంతలోనే అంతగా ఎలా మారతారనుకుంటున్నావా. అదేం కాదు ఇలా అభిప్రాయాలు మార్చుకునే వారికోసమే గురజాడ వారి గిరీశం డైలాగ్‌ పుట్టింది.

బొర్రయ్యా నిజంగా ఇప్పుడు ఈటల రెండింటికీ చెడిన రేవడి అయ్యాడు. ‘న ఘర్‌ కా న ఘాట్‌ కా’ అన్నట్లయ్యింది అతని రాజకీయ భవిష్యత్తు. బీసీల కోసం గొంతెత్తానన్నాడు, నిరంకుశ పాలనా అన్నాడు. తన నియోజకవర్గంలోనే బీసీలందరూ తన పక్షం వహిస్తారనుకున్నాడు. అంతే కాదు, రాష్ట్రంలో బీసీలందరూ తన వెనుక నడుస్తారని వచ్చే ఎన్నికల్లో తనదే విజయం అని తానే ముఖ్యమంత్రి అవుతానని పగటికలల్లో తేలిన ఈటల ఏమిటి తన భవిష్యత్తును తానే ఇలా తుస్‌మనిపించుకున్నాడని నేను ఆశ్చర్యపోవడం లేదు.

సామాజిక మాధ్యమాల్లో నిత్యం వీరత్వాన్ని చూపే సోకాల్డ్‌ మేధావులు ఇలాగే అనుకున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం వచ్చింది ఈటల బీసీల పార్టీ పెడతాడు. నిరంకుశత్వానికి ఎదురుతిరిగిన హీరో అని రాసిన ఈ ఫేస్‌బుక్‌ మేధావులు, వాట్సప్‌ ప్రొఫెసర్లు ఎక్కడికి పోయారు. ఈయన బీజేపీలో చేరుతున్నందుకు ఈ మేధావులంతా నీరుగారిపోయి, ఎక్కడో అదృశ్యమయ్యారు.

బొర్రయ్యా ఒకవేళ బీసీల సంక్షేమం పట్ల ఈటలకు ఇంత ప్రేమ ఉంటే ఏనాడైనా మంత్రి మండలిలో ఇదిగో బీసీల కోసం లేదా ఫలానా చేతివృత్తి వారికోసం ఈ పథకం ప్రవేశపెడదామని తనకు తాను సొంతంగా ప్రతిపాదించాడా ఈ బీసీ మంత్రి. ఏ రాష్ట్రంలోనూ అమలుకానన్ని బీసీ సంక్షేమ పథకాలు తెలంగాణలో నేడు అమలవుతున్నాయి. వీటన్నింటికీ రూపకల్పన చేసింది సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాని మంచిచెడ్డలన్నీ గమనించి మంత్రిమండలి ఆమోదించి అమలుచేస్తూ ఉంది. మరి ఏమైంది అధికారంలో ఉండగా ఈయన గారి బీసీ ప్రేమ. ఆస్తులు పెంపొందించుకోవడంలో చూపిన ప్రేమ బీసీల పట్ల చూపలేదే. ఇరవై ఏండ్లలో తాను తనకోసం ఏం చేసుకున్నాడు బీసీలకు ఏంచేశాడని ఏనాడైనా ఆలోచించాడా..

‘కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్‌
తమ తమ నెలవులు తప్పిన
తమవారలె శత్రులగుట తధ్యము సుమతీ’

అని సుమతీ శతకకారుడు ఏడెనిమిది వందల ఏండ్ల కిందటే చెప్పాడు. ఇది నేడు ఈటల పరిస్థితి. తన నెలవును తానే కాలద్రోసిన ఈటల తనపార్టీని తానే శత్రువును చేసుకున్నాడు. ఇక రాజకీయ భవిష్యత్తు అంతా శృంగభంగమే కానీ అంగబలం రాజకీయ బలగం ఏదీ దరిచేరదు. బీజేపీలో చేరి ఈటల సాధించేదేమిటి. తన అక్రమ సంపాదనలపైన అక్రమ కబ్జాల పైన ఇక్కడ రాష్ట్రంలో కేసులుండి చర్య తీసుకుంటుంటే జాతీయస్థాయిలో ఉన్న బీజేపీ పార్టీ తనకు రక్షణగా వస్తుందని అనుకుంటున్నాడా. అంటే అక్రమ కేసుల్లో ఉన్న నాయకులనందర్నీ, ప్రయాణించే పడవలకే చిల్లులు పెట్టే ప్రబుద్ధులనందరినీ ఆ పార్టీ చేర్చుకొని మునిగిపోయేదే అని అనుకుంటున్నాడా. దానితో ఈయనకు ఒరిగేదేమిటి. విపరీతమైన ప్రజావ్యతిరేక నిర్ణయాలతో చర్యలతో జాతీయ స్థాయిలో ఆ పార్టీ కుదేలవుతున్న రోజుల్లో సాక్ష్యాత్తు అధినాయకుని గ్రాఫ్‌ ఘోరంగా పడిపోతూ ఉందని గంగానదిలో శవాల సాక్షిగా మీడియా రాస్తుంటే ఈటల ఆ గంగానదిలో ఈతకొట్టాలనుకోవడంలో విజ్ఞత ఏమిటి. ఈటలకు కాకున్నా కనీసం ఆ పార్టీకైనా ఈ మాత్రం విచక్షణ లేదా. బీసీల కోసం ఒక పార్టీ పెట్టి సొంతంగా దాన్ని నడిపితే తెలంగాణలో ఇతర ప్రతి పక్షపార్టీల దృష్టిలోను సోకాల్డ్‌ సోషల్‌ మీడియా హీరోల దృష్టిలోనూ తాను కూడా ఒక హీరో అయ్యేవాడు కదా ఈటల.

బొర్రయశెట్టి: అయితే గురువు గారూ ఇక ఈటల గారి పరిస్థితి ఏమిటంటారు సూటిగా చెప్పండి రెంటికీ చెడ్డ రేవడేనా.

జంఘాలశాస్త్రి: ఇంకేముంది శిష్యా అంతకన్నా మంచి మాట చెప్పాలి. ఒక నాయకుడు ఈయనని పైకితెస్తానని ఊదరగొట్టాడు. విశ్వామిత్రుని లాగా మరొక నాయకుడు ఇంకో స్వర్గం చూపుతానన్నాడు. ఈటలకు చివరికి మిగిలేది త్రిశంకు నరకమే.

  • వ్యాఘ్రనేత్రుడు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
న ఘర్‌కా న ఘాట్‌కా

ట్రెండింగ్‌

Advertisement