కాషాయం కాదంటే.. దేశ ద్రోహి కిందే లెక్క
నల్ల బట్టలు కప్పుకొంటేనే.. మత స్వేచ్ఛ ఉన్నట్లు అంట
దేశం నిండా ఇప్పుడు రంగుల విభజన..
ధర్మం అంటే ఒకే రంగు
కాదంటే దేవుడిని ధిక్కరించినట్లే
రెచ్చగొట్టే రంగు ఒకటి
ఎప్పుడూ మైక్ ముందు విషం గక్కుతుంది
సమానత్వం అంతటా సందిగ్ధ అవస్థలో..
అబద్ధానికి రంగులు పూసి.. సత్యం కనబడకుండా చేశారు
సోషల్‌మీడియాను రంగుల్లో ముంచి
వైరలైందే నిజమైపొయింది
అసలు వార్తల రంగులు వెలసిపోయాయి…
రంగుల గొప్పల వాదనలో.. మానవత్వపు రంగు మరిచారు
కలిపి ఉంచే రంగు కనబడితే ఒట్టు
నిర్మలమైన నీళ్ల లాగా
బతుకులను నిలిపే రంగు కావాలిప్పుడు..
ఏదో ఒక రంగు పూసి.. అనవసరపు ఆందోళనలో ముంచి
మనల్ని కనికట్టు చేసి.. ఓటును బ్యాలట్ బాక్స్‌లో వేసుకునే
మహా రంగుల యజ్ఞం జరుగుతుంది జాగ్రత్త..
దాసరి మోహన్
99853 09080