లక్నో : 5జీ నెట్వర్క్ రావట్లేదని గ్రామస్తులు టెక్నీషియన్‌ను బంధించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలోని హర్దౌలి గ్రామంలో 5జీ నెట్వర్క్ రావట్లేదని ఆగ్రహంచిన స్థానికులు.. ఓ మొబైల్ టవర్ టెక్నీషియన్‌ను నిర్బంధించారు. సెప్టెంబర్ 10న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం.. ఊరిలో రెండేండ్ల క్రితం మొబైల్ టవర్ ఏర్పాటు చేసినా ఇప్పటి దాకా 5జీ సేవలు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు టవర్ వద్దకు వచ్చిన టెక్నీషియన్‌ను అక్కడే బంధించారు.