తెలంగాణ పోరుజేసీ
తెలంగాణ రాజ్యం తెచ్చి
నీళ్లు నిధులు మనకే చేసిన
మా గొప్ప సారు ॥జై జై కేసీఆర్
ఆసరాతో కొడుకుగా నిలిచి
కల్యాణలక్ష్మితో అన్నగా నిలిచి
తెలంగాణకే అండగా నిలిచిన
మా ఆత్మబంధు ॥జై జై కేసీఆర్
అమ్మ ఒడితో అమ్మ లాలన
కేసీఆర్ కిట్టుతో మేనమామ లాలన
భలే ఉంది కేసీఆర్ పాలన
పసిడి తెలంగాణలోన ॥జై జై కేసీఆర్
కాళేశ్వర నీటితో తీరే బాధలు
నిండేనే మా ఊరి చెరువులు
పండేనే రెండు పంటలు
తుడిచావు మా కన్నీళ్లు ॥జై జై కేసీఆర్
కంటి వెలుగుతో కాంతి వెలుగులు
సింగరేణితో కరెంటు జిలుగులు
భాగ్యనగరికి భలే మెరుగులు
మెచ్చేనే అన్ని పక్షాలు ॥జై జై కేసీఆర్
రైతుబంధువు దళిత బంధువు
జనం మెచ్చిన జన నేతవు
తెలంగాణకు జాతిపితవు
చంద్రశేఖర రావు ॥జై జై కేసీఆర్
మిషన్ కాకతీయ హరితహారము
మిషన్ భగీరథ ఆహారభద్రమూ
డబుల్బెడ్డురూం గృహలక్ష్మిపథకం
అభివృద్ధ్దే నీ పంతము ॥జై జై కేసీఆర్
పల్లెలన్నీ ప్రకృతి వనాలు
ఊరూరా వైకుంఠధామాలు
బల్లల్లో మెరుగైన చదువులు
నీకు వేలవేల దండాలు
॥జై జై కేసీఆర్
అమ్మ మురిసే బతుకమ్మచీరతో
నేతన్న మెరిసే చేనేత లక్ష్మితో
ఆరోగ్యం వచ్చే ఆరోగ్యలక్ష్మితో
కేసీఆర్ నీ పథకాలతో ॥జై జై కేసీఆర్
చేయూతనిచ్చిన చేనేత మిత్ర
ఇంటింటికి నీదే పెద్దన్న పాత్ర
మరో మారు నీదే జైత్రయాత్ర
మరవదు తెలగాణ చరిత్ర
॥జై జై కేసీఆర్
(కచ్చీరు దగ్గర కొంత మంది ప్రజల మాటలు పాట రూపంలో)