ముద్దును ముద్దు
ముద్దుపెట్టుకున్నట్టుగా ఉన్నది
ఇరు పెదాల్లో అందాన్ని చూస్తుంటే…..
దేని అందం దానిదే
దేని ఆనందం దానికే
దాగిన ఇష్టాన్ని పేరు పెట్టి
పిలిచినట్టు……
రాసిన కవితను తనపై చూచి
రాయమన్నట్టు……
పచ్చి నిజాల్ని
అప్పచెప్పమన్నట్టు…..
పిచ్చి ఆశల్ని పరిచయం
చేయమన్నట్టు…..
రెండు పెదాలకు పోటీ .
ముద్దుకు ముందు ముద్ద రేకుల్లా
పెదవులు ప్రేమకు పదవులై…..
ముద్దు తరువాత మల్లె సిగ్గుల్లా
ఆ పెదవులే ప్రేమకు సరదాలై
వెచ్చని ఎద వీధిలో
ఊరేగే ప్రతి కలకు
పెదవి ముద్రే అనుమతి
పెదవి స్పర్శ తొలి బహుమతి.
ఇక మదిగదిలో
ప్రతి ఆలోచన ఓ తొలి రేయి
ప్రతి పిలుపులో ఆశల మలుపు
ప్రతి మలుపులో హాయిని గెలుపు
అడుగడుగునా
ముద్దు వేసే అడుగే
దేహమంతటా….సందేహమంతటా
సంతోషం…సర్వస్వం
సంబరం…సుందరం
చందలూరి నారాయణరావు: 97044 37247