ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, వాన మొదలైంది. ‘వాన రాకడ ప్రాణం పోకడ’ తెలియదన్నట్టు ఉన్నట్టుండి ఈ వాన ఏమిటో? అంటూ విసుక్కుంటూ వంటింట్లో పనులు చేసుకుంటుంది రాజమ్మ. గడియారం పది గంటలుకొట్టింది. చిట్టితల్లి స్కూల్ నుంచి వచ్చేస్తుందనుకుంటూ గుమ్మం దగ్గర నుంచోటం, ఆటో ఆగటం ఒకేసారి జరిగాయి. లలిత బాబాయి చేతిసంచితో లోపలికి వచ్చాడు. ఆఫీసులో పని ఉందని బాబాయి నెలలో రెండు సార్లయినా వస్తాడు. వచ్చినప్పుడు, లలిత, సూరి బాబాయ్ అన్న కూతురు ఇంట్లో దిగుతాడు.
వంటింటి గుమ్మంలోంచి తొంగిచూసింది రాజమ్మ ‘వచ్చా డా?’ అని అనుకుంటూ ‘పొద్దున్నే వచ్చిన వాన, పొద్దెక్కివచ్చిన చుట్టం’ ఒక పట్టాన పోరు అంది గట్టిగా. అత్తయ్యా.. మెల్లిగా మాట్లాడండి వింటే బాగుండదు అంది లలిత. ఉన్నమాటే అన్నాను, ‘ఉన్నమాటంటే ఉలుకెక్కువ’ అని.. అంటూ దీర్ఘం తీసింది రాజమ్మ.
‘బాబాయ్, భోజనానికి రా. చూడు రెండవుతుంది’ అంది లలిత.
‘తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు’ అన్నట్టు మీ బాబాయి శుభ్రంగా కడుపు నిండా తినే వెళతాడు. నువ్వు బెంగపడకు అని రాజమ్మ అంటుంటే లలిత భయపడుతుంది బాబాయి వింటే బాగుండదని.
వాన బాగా పెరిగింది, లల్లీ ఈ వాన తగ్గేట ట్టు లేదు నేను రాత్రి వెళ్లిపోవాలని అనుకు న్నా కానీ పనికాకుండా వెళ్తే మళ్లీ రావాలి కదా అన్నాడు.
అవును నాయనా, మనకో సామెతుంది కదా ‘దరిద్రుడు తలకడిగితే వడగళ్ల వాన’ అని నువ్వు పని చేసుకువెళ్లిపోదామనుకుంటే ఈ వాన ఒకటి పని కానీయకుండా అంది రాజ మ్మ. సూరి ఎవరి మాటలు పెద్దగా పట్టించుకోడు, పైగా అందరితో సరదాగా మాట్లాడటం అతని స్వభావం. నిజమే పిన్ని గారూ, మా అమ్మ అనేది ‘క్షణం తీరికలేదు పైసా ఆదా యం లేదు’ అని. ఇప్పుడు నా పని అలాగే ఉంది కదండీ పిన్నిగారూ అన్నాడు సూరి.
భోజనం దగ్గర కూర్చున్న సూరితో మాటలు మొదలు పెట్టింది రాజమ్మ. అవును మీ అమ్మాయి పెళ్లి కుదిరిందా? అంది. చూస్తున్నాను, జాతకాలనీ గోత్రాలనీ ఒకటి కుదిరితే ఒకటి కుదరవు. అదే ఏ సంబంధం కుదురుతుందో మరి చూడాల న్నాడు సూరి. గొంతెమ్మ కోరికలు లేకుండా సంసారపక్షంగా చూసుకుంటే పెళ్లిండ్లు త్వరగా కుదురుతాయి. అయినా మనం ఎవరం పెళ్లిళ్లు చేయడానికి ఆ పైవాడే కుదురుస్తాడు. ‘గంతకు తగ్గ బొంత’ని అంటూ రాజమ్మ సూరి విస్తట్లో పెరుగు వడ్డించింది. ఇంకొంచెం వేసుకో అంటూ మళ్లీ వేసింది.
బాబాయ్ అంటే లలితకు చాలా ఇష్టం. చిన్నప్పుడు తనను బడికి స్కూటర్ మీద తీసు కువెళ్లటం, మధ్యలో స్కూటర్ ఆపి మిర్చీలు, పకోడీలు కొనిపెట్టడం లలిత మర్చిపోలేదు. అమ్మాయి, లలితా గొడుగుందా? అన్నాడు సూరి. లలిత గడియారం వంక చూసింది, నాలుగవుతుంది. నాలుగైతే బాబాయి ఏదైనా తిని టీ తాగాలి.
వాన కాస్త తగ్గుతుందిలే ఆగొడుగియ్యి అన్నాడు మళ్ళీ. ఆ సందు చివరి దాకా వెళ్ళొస్తా అంటూ బయలుదేరాడు. ఓ అరగంటలో వచ్చా డు మిర్చీలు, పకోడీలు, నా లుగు లడ్డులు తీసుకువచ్చి పిన్నిగారూ, ఇవి తినండంటూ ఆ పొట్లాలు ఆవిడ చేతి లో పెట్టాడు.
ఎందుకివి? ఇంట్లో ఇంత ఉప్మా చేసుకు తింటే చాలాదా? అందుకే మన పెద్దవాళ్లు అన్నారు సంపాదిస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనక వేసుకొమ్మని’ ఇలా డబ్బు ఖర్చు పెట్టడం తగదు అంది రాజమ్మ. సూరి ఆవిడ మాటలు పట్టించుకోకుండాఒక ప్లేట్లో తనకి కావలసినవి పెట్టుకొని ముందు గదిలోకి వచ్చి టీవీ చూస్తూ కూర్చున్నాడు.
డాక్టర్ ముక్తేవి భారతి: 99896 40324