సీ॥ ఎములాడ రాజన్న ఎల్లశుభముల గూర్చె
యాదాద్రి నరసన్న అభయమిచ్చె
భద్రాద్రి రామయ్య బాగు దీవెనలిచ్చె
కొమురెల్లి మల్లన్న కోర్కెదీర్చె
కొండగట్టంజన్న కోటి వరాలిచ్చె
రామప్ప లింగన్న క్షేమమరసి
ఆలంపురము జోగులాంబ చల్లగచూసె
బాసర మాత సౌభాగ్యమొసగె
ఆ.వె.॥ సకల దేవతా మంగళా శాసనములు
సర్వ భారత ప్రజల సుస్వాగతములు
శక్తియుక్తులనీయగా సాగు కాక
చంద్రశేఖర రాయార్య జైత్రయాత్ర
డాక్టర్ ఆయాచితం శ్రీధర్ 98498 93238