పాలరాయల రేగుబండ్ల స్నానా లాడి
క్రొంబట్టు పుట్టమ్ము కూర్చి కట్టి,
నువ్వులు బెల్లంబునున్ మెక్కి పచ్చని
జామ పండులను ముచ్చటగ నమలి,
క్రొత్త బియ్యపు కూడు గుడిచి త్రేన్పులు తీసి
పచ్చదోనల మునిపంట గొరికి,
చకిలాలు కరకర చప్పుడ్లు వేయగా
దవడలాడించి రేబవకులందు,
ముంగిళల రంగవల్లికర్ మురిసిపోవ
భుగభుగ భుగాయమానమై భోగిమంట
అన్నిదిక్కుల వెలుగొంది అందగింప
వచ్చె సంక్రాంతి, మానవావళికి శాంతి.
(మహాంధ్రోదయం నుంచి)
– దాశరథి