ఎక్కడైనా ఎప్పుడైనా
ద్రష్టగా దేశ సమగ్రత కోసం వేసే
మొదటి అడుగు సాహాసమే మరి !
ధీరోదాత్త నాయకుడు
ప్రగల్భాలు జపించడు
బ్యాండు వాయించినట్లు
పటాటోపం ఉండదు
లోకులు కోకిలలు కాదు కదా !
మొదటి అడుగును స్వాగతించక
వ్యాఖ్యానాలు చేస్తారు !
దండి ఉప్పు సత్తాగ్రహానికి
గాంధీజీ మొదటి అడుగు
పిడికిలిగా ఉద్యమమై
సముద్రంగా సాగింది !
లోక క్షేమం కోరే నాయకుడి
మొదటి అడుగు
రేపు కోటి కోటి అడుగులుగా
హిమాలయం వరకు !
దేశమాత సకల జనులను
అక్కున చేర్చుకునే
నాయకుడి కోసం
ఎదురు చూస్తోంది!
రేపు మొదటి అడుగుకే
విజయ యాత్రగా చరిత్ర !
-కందాళై రాఘవాచార్య , 87905 93638