బీజేపీ పాలనలో దేశం ద్రవ్యోల్బణం వైపు అడుగులువేస్తున్నది. ప్రభుత్వాలను కూల్చివేస్తూ దేశ సమాఖ్యతను విచ్ఛిన్నం చేస్తున్నది. దేశ పరిస్థితులను చూసి గత రెండేండ్లలో 6.70 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ ఏడాది మరో 4.80 లక్షల మంది పౌరసత్వం వదులుకోవడానికి సిద్ధమయ్యారంటే మోదీ బీజేపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు. రాష్ర్టాలకు ఏదో ఒరగబెట్టినట్టు బీజేపీ నాయకులు సంకలు గుద్దుకుంటున్నారు. తెలంగాణకు నయా పైసా ఇవ్వనోడు తెలంగాణ గడ్డ మీద ఉత్త ప్రసంగాలతో మీటింగ్ పెడుతడట. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి ఇవ్వడు, ఒక్క కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడు, ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వడు, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వడు, మనం కట్టిన పన్ను పైసలు ఇవ్వడు. ఏం ఇవ్వనోడు మనకెందుకు. మన గడ్డ మీదికి వచ్చి పోజులెందుకు. మతం మతమని, నమో నమః అంటూ పల్లేరుగాయల ముచ్చట్లతో లొల్లి పెట్టేటందుకా.. మీ నంగనాచి దొంగ కబుర్లు వినేదెవరు? ఏది అడిగి నా అన్నీ ఇచ్చామంటూ సుద్దపూస లెక్క కట్టుకథలు, పచ్చి అబద్ధాలు. మోదీ తెలంగాణకు బాకీ పడ్డవన్ని, ఇవ్వాల్సినవన్ని ఇచ్చి మా గడ్డపై అడుగుపెట్టు. లేకుంటే నిగ్గదీసి అడుగుతామని మా సింగరేణి కన్నెర్ర జేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లయినా విభజన హామీ లు నెరవేరలేదు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఇతర రాష్ర్టాల్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం తెలంగాణపై వివక్షకు అద్దం పడుతున్నది. తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న గిరిజన యూనివర్సిటీ జాడే లేదు. తెలంగాణను కుట్రపూరితంగా చూస్తూ.. వ్యతిరేక నిర్ణయాలు, చర్యలు తీసుకుంటూ అవమానిస్తున్నారు. లక్షల మంది తెలంగాణ యువతకు ఉజ్వల ఉపాధి కల్పించే సామర్థ్యం ఉన్న ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి మా పిల్లల భవిష్యత్తును ఆగంజేస్తున్నరు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు, 16 ఐఐఎం, 87 నవోదయ పాఠశాలలు, 12 ఐసీఐఆర్, ట్రిపుల్ ఐటీలు ఇతర విద్యాసంస్థలు మంజూరుచేసి, ఒక్కటంటే ఒక్క విద్యాసంస్థను కూడా తెలంగాణకు ఇవ్వని నీవు ఈ గడ్డపై అడుగు పెట్టడానికి సిగ్గుపడాలి మోదీజీ.
బీజేపీ పాలనలో నల్లచట్టాలు తెచ్చి రైతుల నడ్డి విరిచింది. యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ మోసం చేసింది. అగ్నిపథ్ వంటి స్కీంలతో సైన్యాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నది. గ్యాస్, పెట్రోల్ , డీజిల్, నిత్యావసరాల ధర లు పేదవారికి అందనంత దూరానికి చేరాయి. బీజేపీ అసమర్థ ఆర్థ్ధిక విధానాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. మా రైతుల ధాన్యం కొనరు. తెలంగాణలోని సింగరేణిని కూడా ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతున్నరు. మీరు ఈ దేశ ప్రధాని అనుకుంటే తక్షణమే.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలుచేయాలి.
బీజేపీ తాము అధికారంలో లేని రాష్ర్టాలపై దండెత్తి దుష్ట రాజకీయాలకు పాల్పడుతూ, మన సంపదను తమ బినామీ పంది కొక్కులకు పంచుతూ జాతి హక్కులను హరించివేస్తున్నది. ఒక కుటిల రాజకీయనేత మోదీ రూపంలో దేశ ప్రజలపై కక్షగట్టి దండెత్తి వస్తుంటే. ప్రజలు ఎటూ పాలుపోలేని పరిస్థితుల్లో సరైన దారిచూపే నాయకులు లేక లో లోపల నలిగిపోయారు. ఆ సమయంలోనే ఒక బలమైన గొంతుక దేశాన్ని నిద్రలేపింది. ఆ గొంతులో ప్రశ్నించే ధైర్యం కనపడింది. ఆ మాటలు వింటుంటే ప్రతి ఒక్కరి మస్తి ష్కం పునరుత్తేజితమవుతుంది. ఆ గొంతు స్వరం పెంచితే రోమాలు లేచి నిలబడుతా యి. ఆ గొంతు సింహగర్జన చేస్తే నరనరా ల్లో రక్తం ఉరకలేసి ప్రవహిస్తుంది. ఆ గొం తుక ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక చవట సన్నాసుల గొంతు పెగలదు. ఆ మాటలు వింటుంటే జీవిత గమ్యానికి ఒక తొవ్వ కనిపిస్తుంది. ఆ గొంతుక వేలాది సింహాల గర్జన. కోట్లాది సర్వ జీవుల గొంతుక. ఆ గొంతుకే మన కేసీఆర్. ఆ గొంతుక.. జాతికి గొడ్డలిపెట్టు లాంటి బీజేపీ ప్రభుత్వంపై సింహగర్జన నినాదం. మోదీ-షాలు, ఎన్ని జేజమ్మ వేషాలేసినా..మత పిశాచి బీజేపీ గొంతు నొక్కేది ఆ గొంతుకే.
రాష్ర్టాల అభివృద్ధికి మోకాలడ్డుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న అప్పులకు కేంద్రం నియంత్రణ విధిస్తున్నది. తమ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాల్లో నీచ రాజకీయాలకు తెరలే పుతూ ప్రభుత్వాలను పడగొడుతున్నది. దేశానికి ఏదో ఒరగబెడుతారని నమ్మి దేశ ప్రజలు రెండుసార్లు అధికారమిస్తే వారు దేశానికి చేసిందేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం తప్ప. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఢిల్లీ నుంచి కోట్ల నోట్ల కట్టలతో హైదరాబాద్‌లో దిగారు. కానీ మీ కుటిల రాజకీయాలను తెలంగాణ తిప్పికొట్టింది. తెలంగాణ పోరాటాల గడ్డపై మీ పప్పులుడకవు.. పోరు బిడ్డల తెలంగాణ ఇది. కొదమసింహం నాయకత్వం వహిస్తున్న తెలంగాణ గడ్డ. ఉద్యమ పులి బోనులో ఇరుక్కుపోయి విలవిలాలాడుతోంది బీజేపీ. మీరెన్ని బలగాలను దించినా, మీ బ్రోకర్ గద్దలు వాలి నా, మీ మత పిశాచులు తిరిగినా.. గులాబీ సైన్యం మీ రెక్కలను విరిచి ముప్పేట దాడి చేస్తుంది జాగ్ర త్త సుమా ..! జాతి భవితకు గొడ్డలిపెట్టు అయిన బీజేపీని నిలువరించాలి. మా తెలంగాణకు వచ్చేవాటిని గుజరాత్‌కు తన్నుకపోతూ.. మళ్లీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ సింగరేణికి వస్తున్నావు. నీకు ఇదే ఆఖరి పర్యటన. దేశానికి కొత్త పొద్దు పొడుస్తుంది. అది తెలంగాణ పొద్దు పొడుపు.. దేశానికంతటికి వెలుగునిస్తుంది.
జై తెలంగాణ.. జై భారత్…! (వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్ )
మీ జేజమ్మ కథలు తెలంగాణలో నడవవు.. దేశమంతా విస్తరించాలనే మీ కుటిల యత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే యుద్ద వీరుడు ఉన్నాడనే విషయం గ్రహించాలి. దేశంలో బీజేపీ రాజకీయాలకు ఎదురుతిరిగి ప్రశ్నించేది కేసీఆర్ మాత్రమే. దేశ ప్రజల కోసం మీపై పోరాటానికి దిగిన ఫైటర్ కేసీఆర్. దేశంలో జరుగుతున్న అక్రమాలు, దేశ పరిస్థితులపై బీజేపీ చర్యలను ఎండగడుతున్న నాయకుడు కేసీఆర్. మీరెన్ని ట్రిక్కులు పన్నిననా తిప్పికొట్టే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది. కేసీఆరే దేశానికి మార్గదర్శనం.
చిటుకుల మైసారెడ్డి 94905 24724