గంగానదిలో నూనె
ఒక్క దీపాన్ని ముట్టియ్యలే
హిమాలయాల సంస్కరణలు
ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలే
ఒక్క చెరువు తూము తెరువలే
అంతా జంగిడిడ్సీనట్లే!
అడవిలో
ఇప్పపూల చెట్టులా
హామీలు రాల్చినవు
అమలు పుచ్చులు పుట్టినవి
నాకు స్ఫూర్తి అంబేద్కర్ అంటివి
బీసీనంటివి చాయ్వాలానంటివి
పార్లమెంట్ మెట్ల మీద బోర్లపడి ముద్దుపెడ్తివి
అన్ని ఇడ్సీ పెట్టెలో పడేస్తివి
నాలుక రుచి తప్పింది
నడకలు గతి తప్పినవి
ఆలోచనలు గంప కమ్మినవి
రాష్ర్టాల కబ్జాలకై
పంచేంద్రియాలు అర్రులు చాస్తున్నయి
పగ్గాలు ఇడ్సిన కోడెల్లా మతోన్మాదం
అమరుల ఆశయాలకై గంపెడాశలు
కలలు పగిలిన బోకు పెంకులైనవి
కశ్మీర్ టు కన్యాకుమారి వరకూ
అంతా ఎగనాకినట్లు అన్నీ బేరాలే..
అమ్మటమే అభివృద్ధని
నీడనిచ్చే సంస్థలను
కార్పొరేట్లకు రాగి పత్రాలుగా రాసిస్తివి
చప్పట్లు కొట్టినందుకు
సామాన్యుల ఇండ్లళ్ల
వంట దీపాలు ఆరిపోయినవి
గంటగంటకు
తుపాను వరదమట్టంలా
కాటేస్తున్న బతుకు ధరలు
తినేతిండి కట్టే బట్టపై జీఎస్టీ కన్నేసినవు
అరచేతిలో బెల్లంలా గిరిజన యూనివర్సిటీ
స్టీల్ ఫ్యాక్టరీ చెట్లు మొలిచె
బరాబర్ చెవులు పిండి ట్యాక్స్..
రాయితీలడిగితే బుల్డోజర్లు.. ఈడీలు…
అన్నీ రాష్ర్టాలు కలిస్తేనే దేశం
తెలంగాణ లేకుండా దేశమెట్లయింది
అన్నీ
అమ్మనైతే అమ్మినవు గానీ
ఆంధ్రను, తెలంగాణకు
తెలంగాణను, ఆంధ్రకు అమ్మకుంటే చాలు..
వనపట్ల సుబ్బయ్య: 94927 65358