పొడిచే పొద్దు నిరసన
పారే నీరు నిరసన
నల్ల నేల నాగలి పోరు నిరసన
నా తెలంగాణ నిరసన
పుడమి తల్లి పులకరించలే
అంబానీ సోపతి
ఆగంజేసే బాపతి
బాత్రూంలో బిల్లు లేని
నల్లధనం తెచ్చి
జనధన్ అకౌంట్లలో
జమ చేస్తానన్న డబ్బులేవి
ఎనిమిదేండ్లు ఏం
ఇచ్చావని రాష్ర్టానికి
నీ రాకకు స్వాగతం పలకను
పెంచిన పెట్రోల్ ధర
గ్యాస్ సిలిండర్ ధర
ప్రతి వస్తువు మీద జీఎస్టీ
ప్రజల సమస్యల
మీద పర్యటన కాదుగా
కుబేరుల కుమ్మ క్
మాకొద్దు నీ మద్దతు..
దేవరపాగ కృష్ణయ్య: 99634 49579