ఏదో ఒక నెపం కావాలి
ఎరువుల వంక పెట్టుకుని
ప్రేమ పుట్టినట్లు పరుగెత్తుకుని
మాటలు మరిన్నీ వొలకబోయడానికి…
మిషన్ భగీరథ ను
మెచ్చుకోవడం తప్ప
రైతుబంధు ను
కాపీ కొట్టడం తప్ప
రూపాయి వదలని రాజు
తెలంగాణా పైకి మరోమారు
మోసకారి మాటల మూటలతో…
తల్లి ని చంపేశావు ఆనాడు
బిడ్డ ఎట్లా వుందో చూస్తావా ఈనాడు
ఎంత ఎదిగిందో
ఎలా మరింత ముందుకు దూకిందో
అసూయ పడడానికి
అడుగు పెడుతున్నారేమో అనిపిస్తుంది…
ఆంధ్రకు ముంత నీళ్ళు
తెలంగాణకు కడివెడు కన్నీళ్లు
టోటల్ గా తెలుగోళ్లకు
తెల్లని నామాలు పెట్టేసి
ప్రాజెక్ట్లన్నీ సొంత ఇలాకా కే తరలించి .
సభ లో సబ్ కా సాత్ పాత పాట పాడడానికా …
సారీ చెప్పి వచ్చేయ్ సారు
ఏం ఒరగబెట్ట లేదని తెలంగాణకు
మళ్లీ మళ్లీ రాకు సారూ మా కాడికి
మాలో మాకు గీతలు గీసి పోవడానికి….
దాసరి మోహన్: 99853 09080