దేశంలో గత మూడు దశాబ్దాలుగా 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సంస్థాగత అప్పులు లభించక పోవడంతో వీళ్లు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. దీంతో వడ్డీ భారం ఎక్కువై, వారి వేధింపులు తాళలేక చేసుకున్న ఆత్మహత్యలే ఎక్కువ. కాబట్టి ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. 3 నుంచి 4 నెలల కాలంలో దేశవ్యాప్తంగా రైతులందరికీ మొదటి ప్రాధాన్యత క్రమంలో బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక రూణాలు ఇప్పించాలి. అప్పుడే రైతన్నలకు అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఆ దిశగా పయనించాలని ఈ లేఖ ద్వారా ప్రధాని మోదీని కోరుతున్నాను.
– పాకాల శ్రీహరిరావు అధ్యక్షులు, రాష్ట్ర రైతు రక్షణ సమి