మహాజాతరకు ఆర్టీసీ సన్నద్ధం
మేడారం మహా జాతరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నారు. గత జాతరలో 3491 బస్సుల ద్వారా 16.82 లక్షల మంది ప్రయాణికులను చేరవేయగా, ప్రస్తుతం 20లక్షల మంది భక్తులను తరలించనున్నారు.
- మేడారానికి 4 వేల బస్సుల ఏర్పాటు
- 25 నుంచి ప్రత్యేక సర్వీసులు
ములుగు, జనవరి 23(నమస్తేతెలంగాణ) : మేడారం మహా జాతరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నారు. గత జాతరలో 3491 బస్సుల ద్వారా 16.82 లక్షల మంది ప్రయాణికులను చేరవేయగా, ప్రస్తుతం 20లక్షల మంది భక్తులను తరలించనున్నారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ రీజియన్ నుంచి బస్సులను కేటాయించారు. మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసి 9 కిలోమీటర్ల పొడవుతో 50క్యూలను ఏర్పాటు చేశారు.
ఇందులో ఒకేసారి 20వేల మంది భక్తులకు వసతి కల్పించనున్నారు. ప్రయాణికుల నిరీక్షణ, సిబ్బంది విశ్రాంతి గదులు, నిర్వహణ కార్యకలాపాల కోసం 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. వెయ్యి బస్సుల పార్కింగ్ కోసం మేడారంతో పాటు కామారంలో సౌకర్యాలు కల్పించారు. 7వేల మంది డ్రైవర్లు, 1811 మంది కండక్టర్లు, 759 మంది భద్రతా సిబ్బం ది, 153 మంది అధికారులతో కలిసి మొత్తం 10,441 మంది ఉద్యోగులకు విధులు కేటాయించారు. ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు ఏర్పడకుండా పెట్రోలింగ్ పార్టీని సైతం నియమించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

