ఎక్కడ స్త్రీలు
గౌరవింపబడుతారో
అక్కడ దేవతలు
నడయాడుతారన్నారు.
ఆడది ఆదిశక్తి అన్నారు
అపర కాళిక అన్నారు
మానవజాతికే మచ్చ తెచ్చేలా
పసిపాపలు మొదలు
వయసుడిగిన మహిళలపై
క్రూర లైంగికదాడులా
ఛీ..ఛీ.. ఈ అవనిలో
దేవతలు కాదు
రాక్షసులు నర్తిస్తూ
వికటాట్టహాసం చేస్తున్నారా?
పరిమళాలు వెదజల్లే
పూమొగ్గలను బూటుకాళ్లకింద
నలిపినట్టు బోసినవ్వుల పసికూనలపై
లైంగిక ఘోరాలు
కనివిని ఎరుగని నేరాలు
రోజూ ఎక్కడో ఒకచోట
నిర్భయలు , దిశలు
ఈ దుర్మార్గపు మానహరణ పర్వంలో
సమిధలై
రాలిపోతున్నారు..కాలిపోతున్నారు
మాటలు రాని నెలల పసిపాపలు
మానమంటే ఏమిటో తెలియని
చిట్టితల్లుల చెరిచే క్రూరులు
రాక్షసులు అనాలా
పశువులు అనాలా
ఉపమానమే లభించడం లేదు
స్త్రీ జాతిపై జరుగుతున్న
ఘాతుకాల అరికట్ట
చట్టాలు కఠినంగా అమలు చేయాలి
నిందితుల పాలిట విష్ణు చక్రం కావాలి
-సంగంబండ జగన్నాథ రెడ్డి, 90145 39458