వేల వ్యాపకాల మనసును నియంత్రించి
వందల ఉద్వేగాల హృదయాన్ని
అదుపులో ఉంచి
ఏకాగ్రతతో చేసే మేధోమథనమే తపస్సు
ఈ అంతర్వీక్షణానికి ప్రత్యక్షమయ్యేది
దేవుడు కాదు సత్యం!
జ్ఞాన అన్వేషణలో పరితపించి చేసే సాధన
మనిషిని మహామనీషిని చేస్తుంది
కాలతత్వాన్ని తరచి చూసి
అంతరాంతరాలను శోధించి
‘జీవితం దుఃఖమయం
కోరిక ఇందుకు మూలకారణం’
అని బోధివృక్షం సాక్షిగా దర్శించినవాడు
బుద్ధుడయ్యాడు!
అతడు చేసింది భిక్షాటన
పంచిపెట్టింది విశ్వప్రేమ
మనిషి పిలిస్తే పలికే బుద్ధుణ్ణి
దేవుడు చూడాలనుకుంటే మాత్రం
తపస్సు చేయవలసిందే!
-అమ్మంగి , వేణుగోపాల్ 94410 54637